Medical Jobs : వనపర్తి ప్రభుత్వ హస్పిటల్ లో ఉద్యోగాలు

వనపర్తి (సెప్టెంబర్ – 24) :ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ వనపర్తి లో ఒక సంవత్సరం పాటు పని చేయడానికి లేదా అవసరం ముగిసే వరకు పని చేయడానికి 20 ఉద్యోగాలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన సేవలను (wanaparthy government hospital recruites 20 medical jobs on contract basis ) పొందేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేశారు.

పోస్టుల వివరాలు :
జనరల్ మెడిసిన్ – 04
OBG – 05
రేడియాలజీ – 03
ఎనస్తీసియా – 05
పీడియాట్రిక్స్ – 01
బయో కెమిస్ట్రీ – 01
మైక్రో బయాలజీ – 01

వేతనం : Rs.1,25,000/- వరకు

ఆర్హతలు :
1) సంబంధిత సబ్జెక్టులో MD/MS/DNB మరియు NMC-2022 యొక్క TEQ రెగ్యులేషన్ ప్రకారం….
2) గుర్తింపు పొందిన / అనుమతి పొందిన మెడికల్లో సంబంధిత సబ్జెక్టులో సీనియర్ రెసిడెంట్ గా ఒక సంవత్సరం చేసి ఉండాలి.
3) MBBS మరియు అదనపు అర్హత తెలంగాణ స్టేట్ మీడియల్ కౌన్సిల్లో నమోదు చేయబడి ఉండాలి.
4) నోటిఫికేషన్ తేదీ నాటికి దరఖాస్తుదారుడి వయస్సు 69 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి.
5) వర్తించే చోట రిజర్వేషన్ రూల్ అనుసరించబడుతుంది.
6) కాంట్రాక్ట్ ఉద్యోగిగా నియామకం పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన ఒక సంవత్సరం లేదా ఖాళీలను భర్తీ చేసే వరకు, అసలు అవసరం ఆగిపోయే వరకు.

దరఖాస్తు విధానం : అర్హులైన అభ్యర్థులందరూ తమ దరఖాస్తులను అన్ని సర్టిఫికెట్ల యొక్క స్వీయ ధృవీకరణతో పాటుగా 25/9/20123 నుండి 27/9/23 వరకు దరఖాస్తులను కింద ఇవ్వబడిన చిరునామా లో చేసుకోవచ్చు.

చిరునామా :
O/o ప్రిన్సిపాల్, ప్రభుత్వ వైద్య కళాశాల, వనపర్తిలో ఉదయం 10.30 నుండి సాయంత్రం 5.00 గంటల మధ్య సమర్పించవచ్చు.

దరఖాస్తు ఫారమ్ మరియు మార్గదర్శకాలు మరియు నోటిఫికేషన్ తో పాటు నిబంధనలు మరియు షరతుల వివరాలను కింద వెబ్ సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఇంటర్వ్యూ తేదీ : సెప్టెంబర్ 28 – 2023 న వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించబడుతుంది.

వెబ్సైట్ : https://wanaparthy.telangana.gov.in/