BIKKI NEWS (SEP. 15) : MBBS CUTOFF MARKS 2023. 2023 – 24 విద్య సంవత్సరంలో కేటగిరి వారిగా ఎంబిబిఎస్ చివరి జాతీయ ర్యాంకులు వివరాలను కింద ఇవ్వడం జరిగింది.
MBBS CUTOFF MARKS 2023 (NATIONAL)
ఓపెన్ కేటగిరి – 1,60,979
EWS – 1,42,945
BC A – 2,58,239
BC B – 1,82,579
BC C – 2,66,945
BC D – 1,75,555
BC E – 1,84,376
SC – 2,45,043
ST – 2,39,180
MINORITY COLLEGE – 1,84,179
అలాగే తెలంగాణ రాష్ట్రంలోని వైద్య విద్య కళాశాలలో 2023 – 24 సంవత్సరంలో సీట్లు దక్కించుకున్న కటాఫ్ ర్యాంకుల వివరాలను కాళోజి నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ప్రకటించింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 54 మెడికల్ కాలేజీలు ఉండగా ఇందులో 8,715 ఎంబిబిఎస్ సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలలోని సీట్లని ఆలిండియా కోటాలో 15%, మిగిలిన సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు.
ప్రైవేట్ కాలేజీల్లోని సీట్లలో 50% కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. మిగిలిన సీట్లలో బి కేటగిరి సీట్లు పోను ఎన్నారై, మేనేజ్మెంట్ కేటగిరీలో యాజమాన్యాలకు భర్తీ అవకాశాన్ని కల్పిస్తారు.
ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా 8 వైద్య కళాశాలలకు కేంద్ర సిగ్నల్ ఇవ్వడంతో… 400 సీట్లు పెరిగే అవకాశం ఉంది. దీంతో గత ఎడాది కంటే ఎక్కువ ర్యాంకు వచ్చిన వారికి కూడా సీట్లు దక్కే అవకాశం ఉంది.
కింద ఇవ్వబడిన లింక్ ను క్లిక్ చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్రం లోని ఏ కళాశాలలో ఎంత ర్యాంక్ లకు ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయో చూడవచ్చు.