BIKKI NEWS (AUG. 18) : MBBS BDS MANAGEMENT SEATS ADMISSIONS 2024. తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కళాశాలలు, మైనారిటీ కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో మేనేజ్మెంట్ కోటా సీట్లకు ఆగస్టు 18 నుంచి దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తూ కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది.
MBBS BDS MANAGEMENT SEATS ADMISSIONS 2024
ఆగస్టు 18 నుంచి 23వ తేదీ సాయంత్రం 5.00 గంటల లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.
దరఖాస్తుతో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లను ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలని సూచించారు.
పూర్తి వివరాలకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయ వెబ్ సైట్ ను సంప్రదించాలని తెలిపారు. దరఖాస్తుల అనంతరం మెరిట్ జాబితాను విడుదల చేయనున్నట్లు వివరించారు.