BIKKI NEWS (AUG. 04) : MBBS ADMISSIONS IN TELANGANA 2024. తెలంగాణ రాష్ట్రంలోని ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తుల నమోదుకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
MBBS ADMISSIONS IN TELANGANA 2024
ఈ నోటిఫికేషన్ ద్వారా యూనివర్సిటీ పరిధిలోని వైద్య కళాశాలల్లోని కన్వీనర్ కోటా సీట్లను భర్తీ చేయనున్నారు. నీట్ 2024లో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ నెల 4న ఉదయం 6 నుంచి 15వ తేదీ సాయంత్రం 6 వరకు అభ్యర్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం సూచించింది. ప్రవేశాలకు సంబంధించి అర్హత, ఇతర సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్సైట్ సందర్శించాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి.