Home > NATIONAL > అక్టోబర్ 1 నుంచి వచ్చే మార్పులు ఇవే…

అక్టోబర్ 1 నుంచి వచ్చే మార్పులు ఇవే…

BIKKI NEWS (SEP. 30) : Major Changes from October 1st 2024. వివిధ ఆర్థిక సంబంధమైన అంశాలపై మార్గదర్శకాలను, నిబంధనలను కేంద్రం సవరించింది. ఇవి అక్టోబర్ 01 నుంచి అమలులోకి రానున్నాయి. అవి…

Major Changes from October 1st 2024.

చిన్న మొత్తాల పొదుపు పథకాలు తపాల కార్యాలయాల్లోని క్రమరహిత ఖాతాల వివరాలను క్రమబద్ధీకరణ కోసం ఆర్థిక శాఖకు నివేదించాలి.

సుకన్య సమృద్ధి యోజనను వేరే వారు ప్రారంభిస్తే వాటిని సంరక్షకులు లేదా జన్మనిచ్చిన తల్లిదండ్రుల పేరున మార్చుకోవచ్చు.

రెండు కంటే ఎక్కువ సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు తెరిచి ఉంటే, అదనపు ఖాతాలను మూసివేస్తారు.

పోస్టాఫీస్ ఖాతాలు, పీపీఎఫ్ వడ్డీ రేట్లలో మార్పులు – మైనర్ల పీపీఎఫ్ ఖాతాలు, చిన్న మొత్తాల పొదుపు ఖాతాల వడ్డీ రేట్లలో మార్పులు ఉంటాయి.

వ్యక్తులు పాన్ నెంబర్ కోసం, ఆదాయ పన్ను రిటర్న్స్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు వారి ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడీని ఉపయోగించడాన్ని అనుమతించరు.

బోనస్ షేర్లు – వాటి క్రెడిట్, ట్రేడింగ్ తేదీకి, రికార్డ్ తేదీ మధ్య సమయాన్ని తగ్గించడానికి అర్హత పొందుతాయి.

సెక్యూరిటీ లావాదేవీల పన్ను (ఎస్ఈటీ) ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ మీద పెరుగుతుంది.

రద్దీ వారాల్లో రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులను గుర్తించడానికి రైల్వే స్పెషల్ డ్రైవ్ చేపట్టనుంది.

వివాద్ సే విశ్వాస్ అమలు వివిధ కోర్టులు, అప్పిలేట్ అథారిటీల్లో పెండింగ్ లో లో ఉన్న పన్ను చెల్లింపుదారుల వివాదాలు, అప్పీళ్లు, పిటిషన్లు సెటిల్ చేసుకొనేందుకు అవకాశం.

ఆమోదం పొందని, ధ్రువీకరించని యూఆర్ఎల్ లు, ఓటీటీ లింక్లు, ఏపీకేలను టెలికం ప్రొవైడర్లు బ్లాక్ చేయాల్సి ఉంటుంది.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు