BIKKI NEWS (JUNE 15) : Magna Carta Day June 15th. ప్రపంచ ప్రజాస్వామ్యానికి ఓనమాలు దిద్దిన పత్రంగా మాగ్నా కార్టాకు గుర్తింపు ఉంది. ఆ లిఖిత పత్రం మీద ఇంగ్లండ్ రాజైన కింగ్ జాన్ ఎడ్వర్డ్ 1215, జూన్ 15న సంతకం చేసిన రోజు ను మాగ్నా కార్టా దినోత్సవం గా జరుపుకుంటారు.
Magna Carta Day June 15th
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ప్రజాస్వామ్య విధానంలో అందరూ సమానం, అందరికీ స్వాతంత్ర్యం అనేవి ఇందులో ప్రధాన నియమాలు. స్వేచ్ఛ, మానవ హక్కులకు ఇందులో ప్రాధాన్యం ఉంటుంది. ఇలాంటి మహోన్నత ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటుకు ప్రేరణగా నిలిచిన ‘మాగ్నా కార్ణా’ ప్రకటనకు గుర్తుగా ఏటా జూన్ 15న ‘మాగ్నా కార్టా డే’గా నిర్వహిస్తారు.
నాటి ఇంగ్లండ్ రాజు విస్తృత అధికారాలను పరిమితం చేసేందుకు తెచ్చిందే ‘మాగ్నా కార్టా’.
లాటిన్ భాషలో మాగ్నా అంటే పెద్దది. కార్టా అంటే ఒప్పందం అని అర్ధం. ఈ ప్రకటనను ప్రజాస్వామ్య హక్కులకు మూలంగా పేర్కొంటారు. రాజు అనుసరించాల్సిన విధులతోపాటు పౌరులు చట్టపరంగా ఎలా నడుచుకోవాలో మాగ్నా కార్టా నిర్దేశించింది.
ఇది కేవలం బ్రిటన్ కే కాక, ప్రపంచవ్యాప్తంగా పౌర స్వేచ్ఛకు నమూనాగా ఉపయోగపడింది. దీన్ని ఇంగ్లండ్ రాజ్యాంగ పత్రంగా పరిగణిస్తారు. అనేక దేశాల రాజ్యాంగాలు దీని నుంచి ప్రేరణ పొందాయి.
మన రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను సూచించే 3వ భాగాన్ని (ఆర్టికల్ 12 నుంచి 35) ‘భారతదేశ మాగ్నా కార్టా’గా పేర్కొంటారు.
చరిత్ర
ఇంగ్లండ్ రాజైన కింగ్ జాన్ ఎడ్వర్డ్ (1167-1216) పాలనలో ప్రజలు అనేక కష్టాలను ఎదుర్కొన్నారు. ఇతడి నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఇంగ్లిష్ సామంతులు, చర్చి నాయకులు రహస్యంగా సమావేశమై రాజు అధికారాన్ని పరిమితం చేయాలని ‘మాగ్నా కార్టా’ అనే పత్రాన్ని రూపొందించారు.
రాజుతో సహా ప్రజలందరూ చట్టానికి లోబడే ఉంటారనే సూత్రాన్ని ఇందులో ప్రతిపాదించారు. అలాగే ప్రజలకు వివిధ హక్కులు కల్పించి, వారి రక్షణ కోసం ప్రత్యేక నియమాలు రూపొందించారు. మొదట జాన్ ఎడ్వర్డ్ దీన్ని ఆమోదించలేదు. అయితే ప్రజల్లో ఇతడిపై వ్యతిరేకత ఎక్కువవడంతో దానికి తలొగ్గి 1215, జూన్ 15న మాగ్నా కార్టాపై సంతకం చేశాడు.
- DAILY GK BITS IN TELUGU 16th JUNE
- చరిత్రలో ఈరోజు జూన్ – 16
- World Waterfalls – ప్రపంచంలోని ఎత్తైన జలపాతాలు
- WATER FALLS DAY – ప్రపంచ జలపాతాల దినోత్సవం
- INDIA WATER FALLS – ఇండియాలో ముఖ్య జలపాతాలు ఎత్తు ఆధారంగా