TODAY CURRENT AFFAIRS IN TELUGU 2nd MARCH 2024
1) బహ్రెయిన్ గ్రాండ్ ప్రీ 2024 విజేతగా ఎవరు నిలిచారు.?
జ :మ్యాక్స్ వెర్ స్టాఫెన్
2) ITF – W35 టోర్నీలో మహిళల డబుల్స్ లో రన్నర్ గా నిలిచిన భారత జోడి ఏది.?
జ : అంకిత రైనా – కులంబయోవా
3) శత్రు జలంతర్గాములు, రాడార్ లను పసిగట్టే ఏ హెలికాప్టర్ ను భారత నావికదళం లో చేర్చనున్నారు.?
జ : MH 60R SEAHAWK
4) బ్రూకింగ్స్ సంస్థ అంచనాల ప్రకారం భారత్ లో 2022 – 23 లో దారిద్ర్య రేఖకు దిగువన ఎంతశాతం జనాభా ఉన్నారు.?
జ : 2% (2011 -12 లో 12.2%)
5) వార్త పత్రికలు నూతన రిజిస్ట్రేషన్ ల చట్టం 2024 మార్చి – 01 నుంచి అమలులోకి వచ్చింది. ఆ చట్టం పేరు ఏమిటి.?
జ : ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ చట్టం – 2023 (పాతది ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ చట్టం)
6) హైదరాబాదుకు చెందిన ఏ రాజులకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ లభించింది.?
జ : లక్క గాజులు (తెలంగాణ నుంచి 17వది)
7) ద్రావణాల స్థితిని బట్టి సజాతి ధ్రువాలు కూడా ఆకర్షించుకుంటాయని ఏ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో తేల్చారు.?
జ : ఆక్స్‌పర్డ్ యూనివర్సిటీ బ్రిటన్
8) స్టేట్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ రిపోర్ట్ -2024 ప్రకారం 2023లో భారత దేశంలో ఎన్ని వాతావరణ సంబంధిత విపత్తుల నమోదయ్యాయి.?
జ : 318
9) ఇటీవల అంతర్జాతీయ టెస్టుల్లో తమ తొలి విజయాన్ని నమోదు చేసుకున్న దేశం ఏది?
జ : ఐర్లాండ్ (ఆఫ్ఘనిస్తాన్ పై)
10) ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10 విజేత మరియు రన్నర్లకు ఇచ్చిన నగదు బహుమతి ఎంత.?
జ : 3 కోట్లు మరియు 1.8 కోట్లు
11) ఫిబ్రవరి – 2024 లో దేశంలో వసూళ్ళు అయినా జీఎస్టీ ఎంత.?
జ : 1,68,337 కోట్లు
12) ఫిబ్రవరి – 2024 లో తెలంగాణ లో వసూళ్ళు అయినా జీఎస్టీ ఎంత.?
జ : 5,211 కోట్లు
13) టీ – ఫ్లైట్స్ పేరుతో చైనా అభివృద్ధి చేస్తున్న రైళ్ల గరిష్ట వేగం ఎంత.?
జ : గంటకు రెండువేల కిలోమీటర్లు
14) వరల్డ్ పావర్టీ క్లాక్ నివేదిక ప్రకారం 2023లో భారత్ లో దారిద్య రేఖకు దిగువన (రోజుకు కొనుగోలు శక్తి 158 రూపాయలలోపు) ఉన్న వారి సంఖ్య ఎంత.?
జ : 3.4 కోట్లు