వైరా ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

BIKKI NEWS (SEP. 09) : Khammam District collector Visited GJC Wyra. ఖమ్మం జిల్లా కలెక్టర్ & మెజిస్ట్రేట్ శ్రీముజుముల్ ఖాన్ ఈరోజు వైరా ప్రభుత్వ జూనియర్ కళాశాలను అకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. వైరా చెరువు వరద పరిస్థితిని గమనించడానికి వచ్చిన జిల్లా కలెక్టర్ వైరా చెరువు పరిశీలన అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ అభ్యర్థన మేరకు ప్రభుత్వ జూనియర్ కళాశాల సందర్శించడం జరిగింది.

Khammam District collector Visited GJC Wyra

ఈ సందర్భంగా శిథిలావస్థలో ఉన్న తరగతి గదులను పరిశీలించడం జరిగింది. కళాశాల గ్రౌండ్ లో ఉన్న వరద నీటిని పరిశీలించి స్థానిక మున్సిపల్ అధికారులను
ఆ నీటిని వెంటనే బయటకు పంపించే ఏర్పాటు చేయవలసిందిగా స్థానిక మున్సిపాలిటీ అధికారులును ఆదేశించడం జరిగింది.

అనంతరం కళాశాల సమస్యల్ని కళాశాల ప్రిన్సిపాల్ యల్. నవీన్ జ్యోతి జిల్లా కలెక్టర్ వివరించడం జరిగింది. కళాశాలలో విద్యార్థులకు తాగటానికి ఆర్ ఓ ఆర్ ప్లాంట్ పని చేయటం లేదని, అదే విధంగా తగినంత తరగతి గదులు లేవని వివరించడం జరిగింది. అసంపూర్ణంగా ఉన్న రెండు తరగతుల గదుల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయించాల్సిందిగా కోరారు.

జిల్లా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ, తరగతి గదుల నిర్మాణం తొందరగా పూర్తి చేయడానికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా డిస్టిక్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారి రవిబాబు గారికి ఫోను ద్వారా ఆదేశించడం జరిగింది.

అనంతరం కళాశాల విద్యార్థిని, విద్యార్థులతో జిల్లా కలెక్టర్ గారు ప్రత్యక్షంగా మాట్లాడటం జరిగింది . విద్యార్థులందరూ మంచిగా చదువుకొని ఉత్తమ పౌరులుగా తయారు కావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. త్వరలో కళాశాలలో ఉన్న సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు