BIKKI NEWS (JUNE 30) : KEY CHANGES FROM JULY 1st 2025. జులై 1వ తేదీ నుంచి అనేక మార్పులు రాబోతున్నాయి. అందులో చాలావరకు మనపై నేరుగా ప్రభావం చూపేవే ఉండడం విశేషం
KEY CHANGES FROM JULY 1st 2025
పాన్ కార్డు తీసుకోవాలంటే ఇకపై ఆధార్ ఉండాలి. ఇప్పటిదాకా ఏదైనా గుర్తింపు కార్డు, జనన ధ్రువీకరణ పత్రం ఉంటే పాన్ కార్డు జారీ చేస్తూ వచ్చారు.
ఆధార్ అథెంటికేషను పూర్తి చేసుకున్నవారికే జులై 1 నుంచి రైల్వే తత్కాల్ టికెట్లు బుక్ చేసుకొనే వెసులుబాటును కేంద్రం కల్పి స్తోంది.
జులై 15 నుంచి బుకింగ్ సమయంలో ఆధార్ ఓటీపీని కూడా నమోదు చేయాల్సి ఉంటుంది.
రైల్వే అధీకృత ఏజెంట్లు తత్కాల్ బుకింగు ప్రారంభమైన 30 నిమిషాల తర్వాతే టికెట్లు బుక్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఏసీకి ఉదయం 10.30, నాన్-ఏసీకైతే 11.30 గంటల తర్వాత మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలి. జులై 15 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది.
పెరిగిన ధరలు జులై 1 నుంచే అమల్లోకి రానున్నాయి. మెయిల్/ఎక్స్ప్రెస్ రైళ్లలో నాన్ ఏసీ ప్రయాణానికి కిలోమీటరుకు ఒక పైసా, ఏసీ తరగతులకు 2 పైసల చొప్పున ధరలు పెంచింది.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్