SAHITYA AKADEMI AWARDS 2023 : కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు 2023

న్యూడిల్లీ (జూన్ – 24) : కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు 2023ను (kendra sahitya akademi awards 2023) ప్రకటించింది. వివిధ భాషల్లో చిరు కథలు, కవిత్వం, నాటకాలు, నవలలు, విమర్శనాత్మక గ్రంథాలకు ఈ పురస్కారాలను అందించారు. బాల సాహిత్యానికి సంబంధించి 22 మందికి, యువ పురస్కారాలకు సంబంధించి 20 మందికి ఈ అవార్డులను ప్రకటించారు.

ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్మన్ సుదామూర్తి కి బాల సాహిత్య విభాగంలో ‘గ్రాండ్ పేరంట్స్ బ్యాగ్ ఆఫ్ స్టోరీస్’ అనే రచనకు అవార్డు దక్కింది.

◆ వివేచని గ్రంథం

తెలుగు భాషకు సంబంధించి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం 2023 తక్కెడశిల జానీ రచించిన ‘వివేచని’ అనే గ్రంథం విమర్శనాత్మక గ్రంథం విభాగంలో ఎంపికైంది.

◆ వజ్రాల వాన :

అలాగే కేంద్ర సాహిత్య అకాడమీ బాల పురస్కారం 2023 తెలుగు విభాగంలో డీకే చదువుల బాబు రచించిన ‘వజ్రాల వాన’ అనే పుస్తకం చిరు కథలు విభాగంలో ఎంపికైంది.

తక్కెడశిల జానీ, డీకే చదువులబాబు ఇద్దరిదీ వైయస్సార్ కడప జిల్లా కావడం విశేషం

◆ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు 2023 పూర్తి జాబితా