DAILY CURRENT AFFAIRS IN TELUGU 23rd JUNE 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 23rd JUNE 2023

1) అంతర్జాతీయ ఒలంపిక్స్ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జూలై 23

2) కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు 2023 లో యువ, బాల పురస్కారాలను అందుకున్న తెలుగు రచయితలు ఎవరు.?
జ : తక్కడశిల జానీ, చదువులబాబు

3) కేంద్ర రైల్వే శాఖ 25 వేల కోట్లతో ఎన్ని వేల రైల్వే వేగన్లను కొనుగోలు చేయనుంది.?
జ : 60 వేలు

4) మహిళల జూనియర్ హాకీ ప్రపంచ కప్ 2023 టోర్నీ ఏ దేశంలో నిర్వహించనున్నారు.?
జ : చిలీ

5) 2024 సంవత్సరానికి ఒలంపిక్స్ క్రీడలు ఎక్కడ నిర్వహించనున్నారు.?
జ : పారిస్ – ఫ్రాన్స్

6) ఐక్యరాజ్యసమితి విభాగం యు ఎన్ డి పి తెలంగాణ రాష్ట్రంలో జీవ వైవిధ్య పరిరక్షణ కోసం ఏ కార్యక్రమాన్ని చేపట్టడానికి ఒప్పందం చేసుకుంది.?
జ : బయోఫిన్ ఫేజ్ 2

7) ఇటీవల ఏ భారతీయ ఖగోళ శాస్త్రవేత్త పేరును ఒక గ్రహ శకలానికి పెట్టారు.?
జ : అశ్విన్ చంద్రశేఖర్

8) గతంలో ఏ భారతీయ శాస్త్రవేత్తల పేర్లను గ్రహ శకలాలకు పెట్టారు.?
జ : సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్, సీవి రామన్, రామానుజన్, విక్రమ్ సారాభాయ్, మనాలి కల్లత్

9) ఎనర్జీ ఎఫిషియన్సీ విభాగంలో తెలంగాణలోని ఏ విద్యుత్ సంస్థకు గోల్డెన్ పీకాక్ అవార్డు లభించింది.?
జ : ఎన్ టి పి సి

10) ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్మన్ సుధా మూర్తికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2023లో బాలల విభాగంలో ఏ రచనకు అవార్డు దక్కింది.?
జ : గ్రాండ్ పేరెంట్స్ బ్యాంక్ ఆఫ్ స్టోరీస్

11) 2050 నాటికి ప్రపంచంలో ఎంతమంది డయాబెటిస్ వ్యాధి భారీన పడనున్నారని అంచనా.?
జ : 130 కోట్లు

12) కృత్రిమ మాంసం అమ్మకానికి ఏ దేశం ఆమోదం తెలిపింది.?
జ : అమెరికా

13) ఇటీవల టైటానిక్ జలాంతర్గామి ఏ మహాసముద్రంలో ప్రమాదానికి గురై అందులో ఉన్న ఐదుగురు మరణించారు.?
జ : అట్లాంటిక్ మహాసముద్రం

14) ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో పెరిగిన పువ్వు పేరు ఏమిటి.?
జ : జిన్నియా

15) అమెరికా పర్యటనలో ప్రధాని మోడీ అమెరికా మొదటి మహిళ జిల్ బైడెన్ కు ఇచ్చిన గ్రీన్ వజ్రాన్ని ఎలా తయారు చేశారు.?
జ : కృత్రిమంగా