కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బయోమెట్రిక్ తప్పనిసరి

న్యూఢిల్లీ (జూన్ – 23) : కేంద్ర ప్రభుత్వ శాఖలు, సంస్థల ఉద్యోగులకు బయోమెట్రిక్ అటెండెన్స్ (Biometric attendance to central government employees) తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ విధానం ద్వారా ఉద్యోగులు తమ హాజరును నమోదు చేయాలని కేంద్రం ఆదేశించింది.

చాలా ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల హాజరు మాన్యువల్ విధానంలో తీసుకోవడంతో కొందరు ఆలస్యంగా విధులకు హాజరు కావడం, విధులకు రాకున్నా వచ్చినట్లు నమోదు చేసుకోవడం వంటివి చేస్తున్నట్టు కేంద్రం గుర్తించింది. ఇక నుంచి బయో మెట్రిక్ ద్వారా హాజరు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని పర్సనల్ మినిస్ట్రీ ఉత్తర్వులు జారీ చేసింది.