kendra sahithya akademi award – మోహన్‌ కు బాల సాహిత్య పురస్కారం

హైదరాబాద్ (ఆగస్టు – 24) : కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారానికి డా. పత్తిపాక మోహన్‌ ఎంపికవడం (kendra-sahithya-akademi-bala-sahithya-award-2022) పట్ల సీఎం శ్రీ కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. గాంధీజీపై ఆయన రాసిన ‘బాలల తాతా బాపూజీ’ గేయ కథకు ఈ పురస్కారం దక్కడం స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భానికి మరింత శోభనిచ్చిందన్నారు.

కీ.శే. డాక్టర్‌ సి. నారాయణరెడ్డి శిష్యుడు, సిరిసిల్ల చేనేత కుటుంబానికి చెందిన శ్రీ పత్తిపాక మోహన్ సాహిత్య రంగంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తెలంగాణ సాహితీ రంగానికి మరింత వన్నె తేవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.