హైదరాబాద్ (డిసెంబర్ – 22) : కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు (Sahitya Akademi Awards) – 2022 ఇద్దరు తెలుగు కవులు దక్కాయి. అనువాద రచనల విభాగంలో వారాల ఆనంద్ రాసిన ‘ఆకుపచ్చ కవితలు’ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం లభించింది. అలాగే మధురాంతకం నరేంద్ర రాసిన ‘మనో ధర్మపరాగం’ నవలకు తెలుగు సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.
ప్రముఖ కవులలో ఒకరైన పద్మభూషణ్ గుల్జార్ భావకవి. హిందీ, ఉర్దూ, పంజాబీ భాషల్లో పుంఖానుపుంఖాలుగా కవిత్వం రాశారు. గుల్జార్ రాసిన గ్రీనో పోయెమ్స్ పవన్ కే వర్మ ఆంగ్లానువాదం తోడ్పాటుతో ‘ఆకుపచ్చ కవితలు’ పేరుతో తెలుగులోకి అనువదించారు ద్విభాషా కవి వారాల ఆనంద్. ఇందులోని 58 కవితలు ప్రకృతికి సంబంధించినవే. మనిషి, ప్రకృతి మధ్య అనుబంధాన్ని ఈ కవితల ద్వారా ఎంతో సూటిగా చెప్పారు రచయిత. ఈ పురస్కారం కింద తామ్ర ఫలకం, రూ.50వేల నగదును అందజేయనున్నారు.