కీర్తి చక్ర‌, శౌర్య చక్ర అవార్డులు 2023

BIKKI NEWS : భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆరుగురికి కీర్తిచక్ర, 15 మందికి శౌర్య చక్ర, 412 మందికి గ్యాలంటరీ అవార్డులను (galentary awards 2023 list) ప్రకటించింది. అశోక్ చక్ర తర్వాత రెండో అత్యున్నత గ్యాలంటరీ పురస్కారం కీర్తిచక్ర. మూడో అత్యున్నత గ్యాలంటరీ అవార్డు శౌర్యచక్ర.

★ కీర్తి చక్ర గ్రహీతలు : (6)

డోగ్రా రెజిమెంట్ కు చెందిన మేజర్ సుభాంగ్,
రాజ్ పుత్ రెజిమెంట్ నుంచి నాయక్ జితేంద్ర సింగ్

మరణానంతరం ఈ అవార్డు పొందిన వారిలో

జమ్ముకశ్మీర్ పోలీసు విభాగానికి చెందిన రోహితు కుమార్,
సబ్ ఇన్స్పెక్టర్ దీపక్ భరద్వాజ్,హెడ్ కానిస్టేబుళ్లు నారాయణ్, శ్రావణ్ కశ్యప్ ఉన్నారు.

★ శౌర్యచక్ర గ్రహీతలు : (15)

మేజర్ ఆదిత్య భదౌరియా,
కెప్టెన్ అరుణకుమార్,
కెప్టెన్ యుద్ధవీర్ సింగ్,
కెప్టెన్ టీఆర్ రాకేశ్,
నాయక్ జస్బీర్ సింగ్ (మరణానంతరం),
లాన్స్నాయక్ వికాస్ చౌదురి,
ముదాసిర్ అహ్మద్ షేక్(మర ణానంతరం),
గ్రూప్ కెప్టెన్ యోగేశ్వర్ క్రిష్టారావ్,
ఫ్లైట్ లెఫ్టినెంట్ తేజ్పల్,
స్క్వాడ్రన్ లీడర్ సందీపుమార్ జజారియా,
ఐఏఎఫ్ గార్డ్ ఆనంద్ సింగ్,
ఐఏఎఫ్ (సెక్యూరిటీ) సునీల్ కుమార్
సత్యేంద్ర సింగ్,
విక్కీకుమార్ పాండే,
విజయ్ ఒరాన్