KANPOOR TEST RECORDS – కాన్పూర్ టెస్ట్ రికార్డులు

BIKKI NEWS (OCT. 02) : KANPOOR TEST RECORDS LIST. కాన్పూర్ వేదికగా భారత్ – బంగ్లాదేశ్ క్రికెట్ జట్ల మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ లో పలు రికార్డులు నమోదు అయ్యాయి. దాదాపు రెండున్నర రోజులు వర్షం కారణంగా ఒక బంతి పడకపోయినప్పటికీ ఫలితం తేలడంతో పాటు భారత్ క్రీడాకారులు పలు రికార్డులను నమోదు చేశారు.

KANPOOR TEST RECORDS LIST

టెస్టుల్లో కేవలం మొదటి 3 ఓవర్లలోనే 50 పరుగులు పూర్తి చేసి అత్యంత వేగంగా ఈ ఫీట్ సాదించిన జట్టు గా భారత్.

అలాగే టెస్టుల్లో అత్యంత వేగంగా 50, 100, 150, 200, 250 పరుగులు సాధించిన జట్టు గా భారత్.

అత్యంత వేగంగా 594 ఇన్నింగ్స్ లలో 27 వేల పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా విరాట్ కోహ్లి నిలిచాడు.

అంతర్జాతీయ క్రికెట్ లో 27 వేల పరుగులు పూర్తి చేసుకున్న 4వ ఆటగాడు కోహ్లీ. సచిన్, సంగక్కర, పాంటింగ్ లు ముందున్నారు.

భారత్ తన మొదటి ఇన్నింగ్స్ లో 8.22 రన్ రేట్ తో పరుగులు సాదించింది.

టెస్టుల్లో అత్యంత వేగంగా 31 బంతుల్లో 50 పరుగులు చేసిన భారత మూడో ఆటగాడిగా యశస్వీ జైశ్వాల్ శార్దుల్ ఠాకూర్ రికార్డు సమం చేశారు. 28 బంతుల్లో పంత్, 30 బంతుల్లో కపిల్ దేవ్ మొదటి రెండు స్థానాలలో ఉన్నారు.

టెస్టుల్లో 3000 పరుగులు, 300 వికెట్లు తీసుకున్న మూడో భారత ఆటగాడిగా రవీంద్ర జడేజా రికార్డు. కపిల్ దేవ్, రవిచంద్రన్ అశ్విన్ మొదటి రెండు స్థానాలలో ఉన్నారు. ప్రపంచంలో 11వ ఆటగాడిగా జడేజా నిలిచాడు.

అంతర్జాతీయ టెస్టుల్లో అత్యంత వేగవంతమైన 50 పరుగుల భాగస్వామ్యం ను రోహిత్ – జైశ్వాల్ నమోదు చేశారు. 23 బంతుల్లో 55 పరుగులు సాదించారు.

వరుసగా మూడు టెస్ట్ ఛాంపియన్ షిప్ లలో 50 కి పైగా వికెట్లు తీసీన ఏకైక బౌలర్ గా రవిచంద్రన్ అశ్విన్ రికార్డు.

టెస్టుల్లో అత్యంత వేగంగా 3000 పరుగులు, 300 వికెట్లు తీసుకున్న రెండో ఆటగాడిగా జడేజా (74 మ్యాచ్ లలో) నిలిచారు. ఇయాన్ బోథమ్ 72 టెస్టుల్లో ఈ రికార్డు సాదించి మొదటి స్థానంలో ఉన్నారు.

అంతర్జాతీయ టెస్టుల్లో 11 సార్లు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచి ముత్తయ్య మురళీధరన్ రికార్డు ను సమం చేసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు.

సొంతగడ్డపై వరుసగా 18 టెస్టు సిరీస్ లను కైవసం చేసుకుంది. 2012 తర్వాత భారత్ ఒక్క సిరీస్ కూడా సొంతగడ్డపై కోల్పోలేదు.

టెస్ట్ క్రికెట్ చరిత్రలో రెండు ఇన్నింగ్స్ లలో కలిపి అత్యధిక రన్ రేట్ (7.36) నమోదు చేసిన జట్టుగా భారత్ నిలిచింది.

ప్రపంచ టెస్ట్ క్రికెట్ చరిత్రలో 180 విజయాలతో అత్యధిక విజయాలు సాధించిన 4వ జట్టుగా భారత్ నిలిచింది. భారత్ కంటే ముందు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లు ఉన్నాయి.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు