BIKKI NEWS (SEP. 07) : Kaloji award 2024 for nalimela Bhaskar. పద్మవిభూషణ్, ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రదానం చేసే ‘కాళోజీ నారాయణరావు అవార్డు’కు 2024 సంవత్సరానికిగాను ప్రముఖ సాహితీవేత్త, బహుభాషా కోవిదుడు, కవి, రచయిత, అనువాదకుడు నలిమెల భాస్కర్ గారు ఎంపికయ్యారు.
Kaloji award 2024 for nalimela Bhaskar
ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అవార్డు కింద రూ. 1,01,116 నగదు, జ్జాపిక అందించి శాలువతో సత్కరిస్తారు.
కాళోజీ అవార్డుకు ఎంపికైన నలిమెల భాస్కర్ గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు.