జూనియర్ ‘గెస్ట్’ అధ్యాపకులు కొనసాగింపు

హైదరాబాద్ (జూలై – 25) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న అతిధి అధ్యాపకులను ఈ విద్యా సంవత్సరం కూడా కొనసాగించాలని ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయం తీసుకుంది.

మఇటీవల రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం వీరిని ఈ విద్యా సంవత్సరం కొనసాగించడానికి నిర్ణయం తీసుకుంది. పాత అతిథి అధ్యాపకులను భర్తీ చేయగా మిగిలిన ఖాళీలలో నూతన అతిధి ఆధ్యాపకులను నియమించుకోవడానికి ఉత్తర్వులలో స్పష్టం చేశారు.