Home > EDUCATION > INTERMEDIATE > JOST – దోస్త్ తరహాలో ఇంటర్ లో జోస్త్ ఆన్లైన్ అడ్మిషన్స్

JOST – దోస్త్ తరహాలో ఇంటర్ లో జోస్త్ ఆన్లైన్ అడ్మిషన్స్

BIKKI NEWS : JOST – Junior College Snline Services Telangana. డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్ విధానం దోస్త్ తరహాలో ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు జోస్త్ ద్వారా ఆన్లైన్ అడ్మిషన్ ప్రక్రియ 2025 విద్యా సంవత్సరం నుండి ప్రారంభించాలని ఇంటర్మీడియట్ బోర్డ్ కసరత్తు ప్రారంభించింది.

JOST – Junior College Snline Services Telangana.

పదవ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులు జూనియర్ కళాశాలలను ఆన్లైన్లో ఆప్షన్లు పెట్టుకోవచ్చు మెరిట్ ఆధారంగా సీట్లను అనగా కాలేజీలను కేటాయిస్తారు. ఈ తరహా ఆన్లైన్ అడ్మిషన్ల కోసమే పదో తరగతిలో ఈ ఏడాది నుండి గ్రేడింగ్ పద్ధతి తీసేసి మార్పుల విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే

అయితే ప్రైవేట్ కాలేజీలో అడ్మిషన్లు ఆన్లైన్ ద్వారా పొందిన విద్యార్థులకు ఫీజుల సంగతి ఎలా అనేది ప్రస్తుతం సమస్య గా మారనుంది. ఇంటర్మీడియట్ లో నియంత్రణ ఉండాల్సి ఉంటుంది. ప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ తో పాటు ఎఫ్‌సెట్, జెఈఈ, నీట్ కోచింగ్ లు అదనంగా ఇస్తారు. వీటికి ఫీజులు కూడా విద్యార్థులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ ఫీజుల విధానంపై త్వరలోనే ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు