BIKKI NEWS (NOV. 15) : Jobs in medak ordinance factory. రక్షణ శాఖ పరిధిలోని ఆర్మర్డ్ వెహికిల్స్ నిగమ్ లిమిటెడ్ కు చెందిన మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఫిక్స్డ్ టర్మ్ ఒప్పంద ప్రాతిపదికన 86 పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతూ ప్రకటన విడుదల చేశారు.
Jobs in medak ordinance factory
ఖాళీల వివరాలు
జూనియర్ మేనేజర్ : 50
డిప్లొమా టెక్నీషియన్: 21
అసిస్టెంట్: 11
జూనియర్ అసిస్టెంట్: 04
విభాగాలు : మెకానికల్, ప్రొడక్షన్, క్వాలిటీ, ఇంటిగ్రేటెడ్ మెటీరియల్ మేనేజ్మెంట్, ఎలక్ట్రికల్, మెటలర్జీ, టూల్ డిజైన్, డిజైన్, క్వాలిటీ అండ్ ఇన్స్పెక్షన్, హెచ్ఎర్, స్టోర్స్,
అర్హతలు : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ (బీఏ/బీఎస్సీ/ బీకామ్) బీఈ/ బీటెక్, పీజీ (ఎంఏ/ ఎమ్మెస్సీ/ ఎంకామ్/ ఎంబీఏ)తో పాటు పని అనుభవం.
వేతనం : జూనియర్ మేనేజర్ కు నెలకు రూ.30,000/-, డిప్లొమా టెక్నీషియన్ కు రూ.23,000/-, అసిస్టెంట్ కు రూ.23,000/- జూనియర్ అసిస్టెంట్ కు రూ.21,000/-
వయోపరిమితి : 30 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్ల సడలింపు.
దరఖాస్తు రుసుము : రూ.300/- , ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్ సర్వీస్మెన్ / మహిళలకు ఫీజు మినహాయించారు.
ఎంపిక విధానం : పని అనుభవం, స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్య్వూల ఆధారంగా.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ పద్దతిలో
దరఖాస్తు గడువు : ప్రకటన వెలువడిన తేదీ (11.11.2024) నుంచి 21 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలి.