JNVS TEST ADMIT CARDS – డౌన్లోడ్ కోసం క్లిక్ చేయండి

హైదరాబాద్ (అక్టోబర్ – 10) : దేశవ్యాప్తంగా ఉన్న 649 జవహర్ నవోదయ విద్యాలయ(JNV)లో 2024 – 25 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి నవంబర్ 04 న జరగనున్న ప్రవేశ పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదల (JNVS VI CLASS ENTRANCE TEST 2024 ADMIT CARDS LINK ) చేసినట్లు నవోదయ విద్యాలయ సమితి ఓ ప్రకటనలో వెల్లడించింది. అడ్మిట్ కార్డుల కోసం కింద ఇవ్వబడిన లింక్ ని క్లిక్ చేయండి.

ఆంధ్రప్రదేశ్ లో 15, తెలంగాణలో 9 విద్యాలయాలు ఉన్నాయి. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు 75 శాతం సీట్లు కేటాయించారు. మిగిలిన 25 శాతం సీట్లు పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయించారు.

ఏటా నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య అందిస్తారు. బాలబాలికలకు వేర్వేరు ఆవాస, వసతి సౌకర్యాలు కల్పించారు.

JNVS ENTRANCE TEST ADMIT CARDS