JNTUH : ఎంటెక్, ఎంఫార్మసీ అడ్మిషన్లు

హైదరాబాద్ (అక్టోబర్ – 03) :జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ (JNTUH ADMISSIONS 2023) – ఫుల్ టైమ్ ఎంటెక్, ఎంఫార్మసీ రెగ్యులర్ కోర్సుల్లో 2023 విద్యా సంవత్సరం కోసం 228 స్పాన్సర్డ్ కేటగిరీ సీట్లలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. హైదరాబాద్, జగిత్యాల, సుల్తాన్పూర్ లలోని జేఎన్టీయూహెచ్ క్యాంపస్లలో ప్రవేశాలు కల్పిస్తారు.

విభాగాలు : ఈఈఈ, మెకానికల్, ఎనర్జీ సిస్టమ్స్, బయో టెక్నాలజీ, కెమికల్, మెటలర్జికల్, సీఎస్ఈ, ఐటీ, ఈసీఈ, ఫార్మసీ, నానో టెక్నాలజీ, సివిల్, ఇన్విరాన్మెంట్, స్పేషియల్ ఇన్ఫర్మేషన్, టెక్నాలజీ, వాటర్ రిసోర్సెస్.

అర్హతలు : సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంసీఏ, బీఫార్మసీ ఉత్తీర్ణతతో పాటు అకడమిక్ సంస్థలు/పరిశ్రమలు/రీసెర్చ్ యూనిట్లలో కనీసం రెండేళ్ల పని అనుభవం ఉండాలి. గేట్/ జీప్యాట్/టీఎస్ పీజీ ఈసెట్ – 2023లో అర్హత
సాధించి ఉండాలి.

ఎంపిక విధానం : విద్యార్హత, గేట్/జీప్యాట్/టీఎస్ పీజీఈసెట్-2023 ర్యాంకు ఆధారంగా ఎంపిక చేస్తారు.

కౌన్సెలింగ్ షెడ్యూల్ తేదీలు : 04.10.2023, 05.10.2023, 06.10.2023.

వెబ్సైట్ : https://www.jntuh.ac.in/