BIKKI NEWS (JULY 06) : రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ తన టెలికం గ్రూప్ అయినా జియో ను ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ కు (JIO IPO with 55 thousand Crores) తీసుకురావడానికి చర్యలు ప్రారంభించినట్లు సమాచారం. దాదాపు 55 వేల కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంగా ఐపీఓ కు రావాలని జియో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇదే జరిగితే దేశం మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపిఓగా జియో ఐపివో నిలవనుంది.
JIO IPO with 55 thousand Crores
ఇప్పటివరకు మార్కెట్ చరిత్రలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆప్ ఇండియా 21 వేల కోట్ల ఐపీఓ తో అతిపెద్ద ఐపివోగా చరిత్ర సృష్టించింది. తాజాగా హుందాయి కంపెనీ కూడా 25 వేల కోట్ల నిధుల సమీకరణ కోసం ఐపీఓ కు దరఖాస్తు చేసుకుంది. త్వరలోనే ఇది కూడా లిస్ట్ కానుంది. ఈ నేపథ్యంలో జియో దాదాపు 55 వేల కోట్ల ఐపీఓ కు ముందుకు రావడం గమనర్హం.
తాజాగా అంతర్జాతీయ సంస్థ ఆయన జెప్రీస్ నివేదిక ప్రకారం జియో ఆస్తుల విలువ 11.11 లక్షల కోట్లుగా అంచనా వేసింది. ఐపీఓ కు వెళ్లే కంపెనీలలో చిన్న కంపెనీలు అయితే 10% పెద్ద కంపెనీలు అయితే 5% శాతం విలువను ఐపీఓ కు కేటాయించాల్సి ఉంటుంది. దీని ప్రకారం జియో విలువ 55 వేల కోట్లకు ఐపిఓ కు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
జియో టెలికాం సర్వీసులో 67.03% వాటాను రిలయన్స్ ఇండస్ట్రీస్ కలిగి వుంది. దాదాపు 17.72% వాటాను మెటా మరియు గూగుల్ సంస్థలు కలిగి ఉన్నాయి. మిగతా 15%ను ఇతర కంపెనీలు వాటాలను కలిగి ఉన్నాయి.
తాజాగా టెలికం టారీపులను కూడా జియో దాదాపు 20 శాతం వరకు పెంచిన విషయం తెలిసిందే. ఐపిఓను భారీగా లిస్టు చేయడానికి టారిఫ్ లను పెంచినట్లు సమాచారం.
రిలయన్స్ ప్రతిఏటా ఆగస్టులో నిర్వహించే వార్షిక సమావేశంలో ఈ ఏడాది ముఖేష్ అంబానీ ఈ మేరకు ప్రకటన చేయొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.