ITBP JOBS : పదో తరగతితో కానిస్టేబుల్ ఉద్యోగాలు

న్యూడిల్లీ (జూలై – 01) : భారత హోమ్ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో టిబెటన్ పోలీస్ ఫోర్స్ (ITBP) 458 constable (driver) jobs పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను జారీ చేసింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా కానిస్టేబుల్(డ్రైవర్) గ్రూప్ ‘సి’ నాన్ గెజిటెడ్ (నాన్ మినిస్టీరియల్) పోస్టులను భర్తీ చేయనున్నారు.

అర్హతలు : గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి మెట్రిక్యులేషన్ లేదా పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

వయోపరిమితి : 21 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.

◆ వేతన స్కేల్ : నెలకు రూ.21,700/- రూ.69,100/-

ఎంపిక విధానం : రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్), ఒరిజినల్ డాక్యుమెంట్ల వెరిఫికేషన్, ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్, మెడికల్
ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

◆ పరీక్ష ఫీజు : 100/- (ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.)

◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్

◆ దరఖాస్తు గడువు :జూన్ 27 – 2023. నుండి జూలై 26 – 2023 వరకు

◆ వెబ్సైట్ : https://recruitment.itbpolice.nic.in/