DAILY CURRENT AFFAIRS IN TELUGU 30th JUNE 2023

1) 11వ ఆసియా కబడ్డీ ఛాంపియన్షిప్ 2023 విజేతగా ఎవరు నిలిచారు.?
జ : ఇండియా (ఇరాన్ పై)

2) భారత కబడ్డీ జట్టు ఎన్నోసారి ఆసియా ఛాంపియన్ గా నిలిచింది.?
జ : ఎనిమిదవ సారి

3) అమెరికాలోని ఏ సంస్థ రూపొందించిన ఎగిరే కారుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.?
జ : అలెఫ్ ఏరోనాటిక్స్

4) మే మాసంలో భారత్ లో కీలక రంగాల వృద్ధిరేటు ఎంతగా నమోదయింది.?
జ : 4.3%

5) 2030 నాటికి భారత్ లో యాప్ ల ఆర్థిక వ్యవస్థ ఎన్ని లక్షల కోట్లకు చేరనుంది.?
జ : 65 లక్షల కోట్లు (జిడిపిలో 12వ శాతం)

6) భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గౌరవ డాక్టరేట్ అందించనున్న యూనివర్సిటీ ఏది.?
జ : మైసూర్ విశ్వవిద్యాలయం

7) కేంద్ర గణాంకాల ప్రకారం ప్రస్తుత ఖరీఫ్ సీజన్ -2023 లో శ్రీ అన్న (చిరుధాన్యాల) సాగు విస్తీర్ణం ఎంత శాతం పెరిగింది.?
జ : 61 శాతం

8) అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ పాకిస్థాన్ కు ఎన్ని వేలకోట్ల బెయిలు ఔటును ప్రకటించింది.?
జ : 24,616 కోట్లు

9) 1703 లో ఆస్ట్రియాలో ప్రారంభమైన ఏ పత్రిక ఇటీవల తన ముద్రణను నిలిపివేసింది.?
జ : వీనర్ జైటుంగ్

10) ఐక్యరాజ్యసమితిలో ప్రపంచ పర్యాటక అభివృద్ధి అంశం 2023లో ప్రసంగించనున్న ఏ భారతీయ కేంద్ర మంత్రి ఎవరు.?
జ : జి. కిషన్ రెడ్డి

11) భారత సొలిసిటర్ జనరల్ గా ఎవరిని పునర్నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.?
జ : తుషార్ మెహతా

12) ఆసియా స్క్వాస్ మిక్స్డ్ డబుల్స్ లో స్వర్ణం, పురుషుల డబుల్స్ లో కాంస్యం నెగ్గిన భారతీయ జోడిలు ఎవరు.?
జ : దీపికా పల్లికల్ – హరీందర్ పాల్ సింగ్ (స్వర్ణం)
అనహత్ సింగ్ – అభయ్ సింగ్ (కాంస్యం)

13) ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం సురక్షితమైన తాగునీరు అందిస్తున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఎన్నో స్థానం నిలిచింది.?
జ : మొదటి స్థానం

14) జాతీయ వైద్యుల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జూలై – 01

15) జీఎస్టీ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జూలై 01

16) పొగాకు ఉత్పత్తి & ఎగుమతుల్లో ప్రపంచంలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది.?
జ : మూడవ స్థానం

17) జమ్మూ కాశ్మీర్ లోని శ్రీమాతా వైష్ణో దేవి ఆలయం ప్రసాదాన్ని భక్తులకు వేగంగా అందించడానికి ఏ కొరియర్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.?
జ : డీటీడీసీ

18) వి – డెమ్ నివేదిక ప్రకారం ఉదార ప్రజాస్వామ్య సూచి మరియు ఎన్నికల ప్రజాస్వామ్య సూచీలలో వరుసగా ఎన్నో స్థానాల్లో నిలిచింది.?
జ : 97 & 108

19) తెలంగాణలో తలసరి విద్యుత్ వినియోగం ఎన్ని యూనిట్లకు చేరుకుంది.?
జ : 2126 యూనిట్లు

20) అమెరికా అధికారిక పర్యటన (స్టేట్ విజిట్) గౌరవం దక్కిన భారత ప్రముఖులు ఎవరు.?
జ : సర్వేపల్లి రాధాకృష్ణ, మన్మోహన్ సింగ్, నరేంద్ర మోడీ.