Gaganyaan – అంతరిక్షంలోకే ఈగలను పంపనున్న ఇస్రో

BIKKI NEWS (AUG. 26) : isro will send Fruit flys to space by Gaganyaan. 2025లో చేపట్టనున్న ఇస్రో ప్రయోగం ద్వారా నలుగురు వ్యొమోగాములతో పాటు 20 ఈగలను అంతరిక్షంలోకి పంపనున్నట్లు ఇస్రో ప్రకటించింది.

isro will send Fruit flys to space by Gaganyaan.

డ్రోసోఫిలియా మెలనోగాస్కర్ (ప్రూట్ ప్లై) జాతికి చెందిన 10 ఆడ ఈగలను, 10 మగ ఈగలను అంతరిక్షంలోకి పంపరున్నట్లు ప్రకటించింది.

మానవుని విసర్జన వ్యవస్థతో పోలిస్తే ఈ ఈగల విసర్జన వ్యవస్థ 70% పోలికలను కలిగి ఉంటుంది. తద్వారా అంతరిక్షంలో మానవుని విసర్జన వ్యవస్థ పై అధ్యయనం చేయడానికి ఈగలను పంపనున్నట్లు తెలిపింది.

అంతరిక్షంలో వ్యోమోగాములు ఘన ఆహారం తీసుకోవడం వల్ల కిడ్నీలలో 30% ఎక్కువగా రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. తద్వారా భవిష్యత్తులో ఈ సమస్యను అధిగమించడానికి ఈగలను అంతరిక్షంలోకి పంపనున్నట్లు ఇస్రో ప్రకటించింది.

ఈగలు అంతరిక్షంలో ఉండడానికి కిట్ లను కర్ణాటక లోని ధార్వాడ వ్యవసాయ విశ్వవిద్యాలయం తయారు చేసింది.

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు