BIKKI NEWS : అంతర్జాతీయ యోగ దినోత్సవము (international yoga day 2024) ప్రతి సంవత్సరం జూన్ 21 న జరుపుకుంటారు. 2014 సెప్టెంబరు 27న భారత ప్రధాని నరేంద్రమోడి ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకొనుట గురించి ప్రతిపాదన చేశారు. Yoga day june 21st
Yoga day june 21st
ఈ తీర్మానానికి 193 ఐరాస ప్రతినిధులలో 175 మంది మద్దతు ఇచ్చారు. భద్రతా కమిషన్‌లో శాశ్వత సభ్యులుగా ఉన్న అమెరికా , ఇంగ్లాండ్ , చైనా , ఫ్రాన్స్ , రష్యా వంటి దేశాలు కూడా ఈ తీర్మానానికి సహ ప్రతినిధులు. విస్తృతమైన చర్చల తరువాత డిసెంబర్ 2014 లో ఆమోదించబడింది. 2015 జూన్ 21న, మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా జరుపుకున్నారు.
YOGA DAY 20234. THEME : “Yoga for Self and Society”
YOGA DAY 2023 THEME : “Yoga for Vasudhaiva Kutumbakam”
జూన్ 21నే యోగా దినోత్సవం జరుపుకోవడానికి గల కారణం జూన్ 21 ఉత్తరార్ధ గోళంలో అత్యధిక పగటి సమయం ఉన్న రోజు. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఆ రోజుకు ప్రత్యేకత కూడా ఉంటుంది. ఎక్కువ పగటి సమయం ఉన్న రోజుగా గుర్తింపు పొందడంతో అదే రోజును అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితికి ప్రధాని మోదీ సూచించారు.
◆ YOGA DAY HISTORY :
ప్రపంచవ్యాప్తంగా మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవం 2015 జూన్ 21న నిర్వహించారు. భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోడీ న్యూఢిల్లీలోని రాజ్‌పథ్‌లో నిర్వహించారు. ఆ వేడుకలకు చాలా దేశాలకు చెందిన నేతలు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. 84 దేశాల నుంచి వచ్చిన నేతలతో పాటు మొత్తం 35,985 మంది యోగా చేసి రెండు గిన్నిస్ రికార్డులను నెలకొల్పారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం భారతదేశంలోని, ప్రపంచంలోని నగరాల్లో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి.