BIKKI NEWS (DEC. 15) : International Tea day on December 15th. అంతర్జాతీయ తేనీటి దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం డిసెంబరు 15వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించబడుతుంది. తేనీరుపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ దినోత్సవం టీ ట్రేడ్ యూనియన్ లు నిర్వహించుకుంటారు.
ఐక్యరాజ్యసమితి మే 21 న ప్రతి ఏడాది అంతర్జాతీయ టీ దినోత్సవం జరుపుతుంది.
International Tea day on December 15th
టీ మొట్టమొదటిసారిగా 4వ శతాబ్దంలో చైనాలో తయారు చేశారు. ఒక చైనాకు చెందిన వైద్యుడు తేయాకు ఆకులను ఎండబెట్టి వేడిచేసి, వేడి నీటిలో నానబెట్టగా వచ్చిన చేదు డికాక్షను వైద్య పరీక్ష కోసం త్రాగాడు. ఆ డికాక్షను త్రాగినందువల్ల అతడు ఉత్తేజాన్ని పొందాడు. అలా నాగరిక ప్రపంచానికి టీ పరిచయమైంది.
ప్రపంచవ్యాప్తంగా తేయాకు ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న దేశాలు టీ ప్రాధాన్యాన్ని పెంచేందుకు అంతర్జాతీయ సదస్సులను నిర్వహించాయి. ప్రతి సంవత్సరం డిసెంబరు 15న అంతర్జాతీయ టీ దినోత్సవం జరుపుకుంటారు. మొదటి అంతర్జాతీయ టీ దినోత్సవం 2005, డిసెంబరు 15న న్యూఢిల్లీలో జరిగింది. రెండవ అంతర్జాతీయ దినోత్సవం 2006, డిసెంబరు 15న శ్రీలంకలో జరిగింది. టీ ఉత్పత్తి చేస్తున్న భారతదేశం, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, ఇండోనేషియా, కెన్యా, మలావి, మలేషియా, ఉగాండా, టాంజానియా వంటి దేశాలలో 2005 నుండి ఈ దినోత్సవం జరుపుకుంటారు
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్