BIKKI NEWS (JULY 03) : International Plastic Bag Free Day july 3rd. ప్లాస్టిక్ వాడకం వల్ల సమాజానికి, ప్రకృతికి కలిగే ముప్పు గురించి ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం జులై 3న అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవంగా జరుపుకుంటారు.
International Plastic Bag Free Day july 3rd.
ప్రస్తుతం ప్రపంచాన్ని పీడిస్తోన్న పర్యావరణ సమస్యల్లో ప్లాస్టిక్ కాలుష్యం ఒకటి. ముఖ్యంగా పునర్వినియోగం కాని ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్లు, బాటిల్స్, ఇతర ఉత్పత్తుల వాడకం ఎక్కువయ్యాక ఈ వ్యర్థాలు భూమి, జలావరణ వ్యవస్థల్లో ఎక్కువగా పోగవుతున్నాయి. దీంతో ఆయా ఆవరణ వ్యవస్థల్లోని జీవులు నష్టపోవడమే కాక, జీవవైవిధ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోంది. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించడంతోపాటు ప్లాస్టిక్ చెత్త రీసైక్లింగ్, కంపోస్టింగ్ పై ప్రజల్లో చైతన్యం కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
ఇంటర్నేషనల్ యూనియన్ పర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ప్రకారం ఏటా 460 మిలియన్ మెట్రిక్ టన్నులకు పైగా ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతోంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం 20 మిలియన్ మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాల రూపంలో గాలి, నీరు, నేల ఆవరణల్లోకి చేరుతుందని అంచనా.
ప్రపంచవ్యాప్తంగా పోగవుతున్న ప్లాస్టిక్ వ్యర్థాల్లో 5వ వంతు భారత్ నుంచే ఉన్నాయి.
ఒక్కో భారతీయుడు సగటున సంవత్సరానికి 11 కిలోల ప్లాస్టిక్ ను వినియోగిస్తున్నట్లు అంచనా.
ప్రతి సంవత్సరం మన దేశంలో 93 లక్షల టన్నుల వ్యర్థాలు వస్తుండగా, అందులో 35 లక్షల టన్నులు పర్యావరణంలోకి చేరుతున్నాయి.
చారిత్రక నేపథ్యం:
ప్లాస్టిక్ వాడకాన్ని నివారించే ఉద్దేశంతో 2005లో స్పెయిన్ కేంద్రంగా ‘రీజీరో’ అనే స్వచ్చంద సంస్థ ఏర్పడి అక్కడి కాటలోనియా, బాలెరిక్ దీవులు ఈ వ్యర్థాల బారిన పడకుండా అనేక చర్యలు చేపట్టింది. 2008, జులై 3న మొదటిసారి ఈ సంస్థ ‘అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవాన్ని’ నిర్వహించింది.
- CURRENT AFFAIRS JULY 3rd 2025 – కరెంట్ అఫైర్స్
- CURRENT AFFAIRS JULY 2nd 2025 – కరెంట్ అఫైర్స్
- PM MODI AWARDS : నరేంద్ర మోదీని వరించిన పలు అవార్డులు
- PM MODI – ప్రధాని మోదీ కి ఘనా జాతీయ పురష్కారం
- GOLD RATE – మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు