BIKKI NEWS (MAY 18) : INTERNATIONAL MUSEAUM DAY MAY 18th. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం, ప్రతి సంవత్సరం మే 18న నిర్వహించబడుతోంది. అంతర్జాతీయ స్థాయిలో, సమాజ అభివృద్ధిలో మ్యూజియంల పాత్రపై ప్రజల్లో అవగాహన పెంచడానికి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.
INTERNATIONAL MUSEAUM DAY MAY 18th
ప్రజల మధ్య సాంస్కృతిక మార్పిడి, పరస్పర సహకారం, శాంతి పట్ల అవగాహన కల్పించేందుకు ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియమ్స్ (ఐకామ్) సర్వప్రతినిధి సభ తీర్మానం ప్రకారం ఏటా మే నెల 18వ తేదీని అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవంగా జరుపుకోవాలని 1977లో నిర్ణయించారు. మ్యూజియం నిపుణులు ప్రజలను కలవడానికి, మ్యూజియంలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వారిని తెలియచేయడానికి ఈ దినోత్సవం ఉపయోగపడుతోంది.
2009లో ఎక్కువమందిని దృష్టిని ఆకర్షించింది. 2009లో జరిగిన అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం వేడుకల్లో 90కి పైగా దేశాలలో 20,000 మ్యూజియంలు వివిధ కార్యక్రమాలను నిర్వహించింది. 2010లో 98 దేశాలు, 2011లో 100 దేశాలు, 2012లో 129 దేశాలలో 30,000 మ్యూజియంలు ఈ వేడుకలో పాల్గొన్నాయి. 2011లో ఈ దినోత్సవ అధికారిక పోస్టర్ 37 భాషలలోకి అనువదించబడింది. 2012 నుండి ఈ సంఖ్య 38కి పెరిగింది.
- AP EAPCET 2025 COUNSELLING షెడ్యూల్
- AP DEECET COUNSELING 2025 షెడ్యూల్
- Jobs – విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంకులో జాబ్స్
- DAILY GK BITS IN TELUGU 4th JULY
- చరిత్రలో ఈరోజు జూలై 04