BIKKI NEWS (MAY 11) : international mothers day special poem by addagudi umadevi. అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా ప్రముఖ రచయిత్రి, కవయిత్రి, వ్యాసకర్త అడ్డగూడి ఉమాదేవి ప్రత్యేక కవిత….
international mothers day special poem by addagudi umadevi
కడుపు పండినప్పుడు
బిడ్డను కన్నప్పుడు
మోదమె తల్లికి ,రక్తం
పాలుగ మారేప్పుడు
తొలి మాటను పలికినపుడు
అమ్మా అని పిలిచినపుడు
అవధిలేని ఆనందం
తన పదవే పెరిగినపుడు
అడుగులు తడబడునప్పుడు
గుండెలపై నడిచేప్పుడు
హృదయమెంతొ పొంగునో
అడుగుల సడి విన్నప్పుడు
వేలుపట్టి నడిచేప్పుడు
బడిలొ భవిత దిద్దేప్పుడు
మోము విరియు కమలమై
ఊడిగమే చేసేప్పుడు
పై చదువులు చదివేప్పుడు
ఫలితాన్నే కన్నప్పుడు
లోన గుబులు ఎందుకో
ఆకసమునకెగిరేప్పుడు
గుండె భారమైనప్పుడు
ఎదురుగ కనలేనప్పుడు
ఏకాకి ఐనదెవరో
కండ్లు కాయలైనప్పుడు
ఏండ్లకేండ్లుగడిచేప్పుడు
గుండెలు చెరువయ్యేప్పుడు
పురిటిగడ్డపై పాదము
మోపగ హృది పొంగప్పుడు
బాధను దిగమింగేప్పుడు
కనులనిండ కన్నప్పుడు
తల్లి ప్రేమ మాటల్లో
వర్ణించగ లేమప్పుడు
తనువు పండి పోయేప్పుడు
మరణకాల వేళప్పుడు
బిడ్డ స్పర్శ తగలగానె
ఊపిరొదులు తల్లప్పుడు
అడ్డగూడి ఉమాదేవి
తెలుగు అధ్యాపకురాలు
- AP EAPCET CUTOFF MARKS – కళాశాలల వారీగా కటాఫ్ మార్కులు
- AP EAPCET 2025 COUNSELLING షెడ్యూల్
- AP DEECET COUNSELING 2025 షెడ్యూల్
- Jobs – విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంకులో జాబ్స్
- DAILY GK BITS IN TELUGU 4th JULY