భూతల్లి బిడ్డలు-చిదిమేస్తున్న పువ్వులు : అస్నాల శ్రీనివాస్

  • 9 ఆగస్ట్ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

“ఒక నిర్దిష్ట ప్రదేశంలో మానవ నాగరికత ప్రారంభమైన నాటి నుండి నివసిస్తున్న అసలైన స్థానిక మొదటి ప్రజలను ఆదివాసులు గా పిలుస్తారు.” – అస్నాల శ్రీనివాస్

BIKKI NEWS (AUG – 9) : ప్రకృతిని నిస్వార్థంగా పూజించేవారు ఆదివాసులు. స్వార్షంతో ప్రకృతిని శాసిస్తూ బతుకుతూ దానిని నాగరిక అభివృద్ధి అంటున్నాడు ఆధునికుడు. ఈ వైఖిరి పర్యవసానం మహమ్మారుల రూపంలో అనుభవములోకి వచ్చి విల విలాడుతున్నవాడు నాగరికుడు. దాపరికంలేని నవ్వులు, దారిద్ర్యానికి పూసిన పువ్వులు లాగా ఆదివాసుల జీవనం ఇప్పటికి కొనసాగుతున్నది. ఐక్యరాజ్యసమితి 1982 నుండి ప్రతి ఏటా ఆగస్టు 9 ని అంతర్జాతీయ ఆదిమవాసుల దినోత్సవంగా నిర్వహిస్తున్నది మానవ హక్కులు పర్యావరణం విద్య వైద్యం అభివృద్ధి ఫలాలు ఆదివాసులకు మరింత చేరువ చేయ్యాలని ఆయా అంశాలలో చైతన్య అవగాహన కార్యక్రమాలను రూపొందిస్తుంది. ఈ సంవత్సరం “సాంప్రదాయక జ్ఞాన పరిరక్షణలో ప్రసారంలో ఆదివాసి మహిళలు” ఆనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఆదివాసులు ఉత్తమ జీవనశైలితో, సాంప్రదాయక జ్ఞానంతో మహామ్మారులను, అనేక విపత్తులను ఎదుర్కొన్నారు. ఈ జ్ఞానం, ఆచరణ విధానాలను సంరక్షించడానికి, మారిన పరిస్థితులలో వారి జీవన రక్షణ కోసం కార్యాచరణ రూపొందిస్తున్నారు. “ఒక నిర్దిష్ట ప్రదేశంలో మానవ నాగరికత ప్రారంభమైన నాటి నుండి నివసిస్తున్న అసలైన స్థానిక మొదటి ప్రజలను ఆదివాసులు గా పిలుస్తారు.” ఈ ప్రజల జీవన స్థాయిని పెంచడానికి ఐక్యరాజ్యసమితి ఇప్పటికే రెండు దశాబ్దాల ను ప్రకటించింది.1995 -2004, 2005- 2016 దశాబ్దాలను ఆదిమవాసుల జీవన స్థాయిని సంస్కృతిని సంరక్షించడానికి కేటాయించింది. 2022 – 2032 దశాబ్దాన్ని ఆదిమ జాతుల భాషల, సంస్కృతి పరిరక్షణ దశాబ్దంగా ప్రకటించి ఏడు వేలకు పైగా భాషలను సంరక్షించే ప్రయత్నాలను ప్రారంభించింది.

2022 – 2032 దశాబ్దాన్ని ఆదిమ జాతుల భాషల, సంస్కృతి పరిరక్షణ దశాబ్దంగా ప్రకటించి ఏడు వేలకు పైగా భాషలను సంరక్షించే ప్రయత్నాలను ప్రారంభించింది. – అస్నాల శ్రీనివాస్

ఆదివాసులు భూభాగంలో 25% ప్రాంతంలో విస్తరించి ఉన్నారు. 90 దేశాలలో 476 మిలియన్ల ఆదిమ జాతులు వారు నివసిస్తున్నారు. జీవవైవిధ్యంలో 80% వీరే కాపాడుతున్నారు. వివిధ వాతావరణ స్థితులకు అనుకూలత చెందే సామర్ధ్యం వీరి సొంతం. ప్రపంచ జనాభాలో ఆరు శాతంగా ఉన్నారు. దాదాపు అన్ని దేశాల పాలకులు వీరి అభివృద్ధి వికాసం పట్ల బలమైన రాజకీయ ఇచ్చను చూపరు. ఇలాంటి వివక్షలతో కునారిల్లుతున్న ఆదిమ జాతులు కొవిడ్19 మహమ్మారితో మరింత జీవన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు.

ఆదివాసులు భూభాగంలో 25% ప్రాంతంలో విస్తరించి ఉన్నారు. 90 దేశాలలో 476 మిలియన్ల ఆదిమ జాతులు వారు నివసిస్తున్నారు. జీవవైవిధ్యంలో 80% వీరే కాపాడుతున్నారు. – అస్నాల శ్రీనివాస్

భారతదేశం లో 104 మిలియన్ల ఆదివాసులు నివసిస్తున్నారు.దేశ జనాభాలో 8.6% ను కలిగిఉన్నారు. అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసము ఫలితంగా దాదాపు 50% ప్రజలు తమ సాంప్రదాయక అవాసాలు నుండి తరిమి వేయబడ్డారు.1947 జూలై లో నెహ్రు ప్రతిపాదించిన లక్ష్యాల తీర్మానం పై నెహ్రు, అంబేద్కర్, తాండన్ హంసా మెహతా, ముఖర్జీ, లహరి మొదలగు ప్రతినిధుల మధ్య ఆదివాసీల ప్రతినిధి బీహార్ కు చెందిన జైపాల్ సింగ్ ముండా (హాకీ క్రీడాకారుడు,1928 ఒలింపిక్స్ లో పాల్గొన్నారు) ఆవేదనాత్మక ఆలోచనాత్మక ఆదివాసీల గర్జన గొంతుకను వినిపించాడు. “భారతీయులలో ఏదైనా ఒక వర్గం అతి అధ్వాన్నంగా చూడ పడ్డారంటే అది మా వాళ్లే ఆరు వేల ఏళ్లుగా మా వాళ్ళు పూర్తిగా విస్మరించ బడ్డారు అవమానించ బడ్డారు మేము సింధు నాగరికత బిడ్డలం ఈ దేశానికి వచ్చిన కొత్తవారు ఆర్యుల వల్ల నాగరిక ప్రపంచం నుండి అడవుల్లోకి తరిమివేయబడ్డవాళ్ళం. మీరంతా బయటనుండి వచ్చినవారే మేము ముందు నుండి ఈ దేశంలో ఉన్న వారం”, కానీ మా చరిత్ర నిండా తిరుగుబాట్లు, అల్లకల్లోలం, దోపిడి ఆక్రమణల మయంగా ఉన్నది. నెహ్రూ ప్రకటించిన సర్వసత్తాక ప్రజాస్వామ్య రిపబ్లిక్ తీర్మానాన్ని ఆమోదిస్తున్నాము. నూతన భారతంలో మాకు సమాన అవకాశాలు ఉంటాయని, విస్మరించరని నేను నమ్ముతున్నాను. ముండా కృషితో నెహ్రు అంబేద్కర్ లు గిరిజన ప్రాంతాల రక్షణకు రాజ్యాంగములో 5, 6 ప్రత్యేక షెడ్యూళ్లు, స్వయం పాలన కౌన్సిళ్లు, గవర్నర్లకు ప్రత్యేక అధికారాలు, వివిధ రకాల దోపిడీ నుండి రక్షణ, గనుల తవ్వక లాభాల్లో కొంత వాటా, చట్ట సభలలో ప్రత్యేక స్థానాలు, విద్య ఉద్యోగ రక్షణలు ఏర్పాటు చేసారు.

ముండా కృషితో నెహ్రు అంబేద్కర్ లు గిరిజన ప్రాంతాల రక్షణకు రాజ్యాంగములో 5, 6 ప్రత్యేక షెడ్యూళ్లు, స్వయం పాలన కౌన్సిళ్లు, గవర్నర్లకు ప్రత్యేక అధికారాలు, వివిధ రకాల దోపిడీ నుండి రక్షణ, గనుల తవ్వక లాభాల్లో కొంత వాటా, చట్ట సభలలో ప్రత్యేక స్థానాలు, విద్య ఉద్యోగ రక్షణలు ఏర్పాటు చేసారు. – అస్నాల శ్రీనివాస్

స్వాతంత్య్రం వచ్చి 74 ఏళ్ళు గడిచినా నేటికీ కనీసహక్కులకు నోచుకోవడం లేదు. మనం పిలుచుకుంటున్న ప్రజాస్వామ్య అభివృద్ధి కి భాధితులుగా ఉన్నారు. జీవన ప్రమాణ సూచికల్లో బాగా వెనుకబడి ఉన్న దళితుల,మైనారిటీల కంటే చాలా వెనుకబడి ఉన్నారు. 25.8% అక్షరాస్యత 62.5% డ్రాప్ అవుట్స్ లను కలిగిఉన్నారు. 40% ఆదివాసులకు వైద్యం అందుబాటులో లేదు. 45% కు సురక్షిత తాగు నీరు లేదు, 60% కు ఇమ్యునైజేషన్ లేదు.ఇంకా జాతీయ ఉద్యానవనాలు, జంతు సంరక్షణ కేంద్రాల స్థాపన,భారీ ప్రాజెక్టులు, గనుల తవ్వకాలు వలన ఆదివాసులు విస్తాపణకు లోనై దుర్భర దారిద్ర్యానికి లోనవుతున్నారు. తాము కాపాడుకుంటున్న వనరులపై, భూమిపై హక్కులు కోల్పోతున్నారు. ఇంకా అటవీ ప్రాంతాలలో వడ్డీ వ్యాపారుల మోసాలు, వారి శ్రమను అతి చౌకగా వాడుకోవడం కొనసాగుతూనే ఉంది.

స్వతంత్రం వచ్చిన రెండు దశాబ్దాల అనంతరం కూడా తమ జీవితాలలో దోపిడీ, అభివృద్ధి నిరాకరణ కొనసాగడంతో అనేక చోట్ల గిరిజన తిరుగుబాట్లు తలెత్తాయి. కాకతీయ వంశస్తుడు చత్తీస్ గడ్ రాజకుటుంబీకుడు ప్రవీణ్ రాజకుమార్ బంజ్ దేవ్ 1966 లో వడ్డీ వ్యాపారస్తులకు వ్యతిరేఖంగా, అడవి రక్షణ కోసం భుంకాల్ సైన్యాన్ని స్థాపించి సాయుధ పోరాటాన్ని నడిపి అమరుడు అయ్యాడు. భూమి సేన, కష్టకారి సంఘంటన, మావోయిస్టు ఉద్యమాలు, బి డి శర్మ లాంటి అధికారులు, శంకర్ గుహ నియోగి లాంటి కార్మిక నేత, బాలగోపాల్, మేధా పాట్కర్ వంటి హక్కుల నేతల చొరవతో అప్పుడప్పుడు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రకటించాయి. ఆదివాసీ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన విద్య వైద్య, పాలన విభాగాలు సమర్ధవంతంగా పని చేయడం లేదు.ఇక్కడ ఉద్యోగులు పని చేయడానికి ఇష్టపడరు.ప్రతి రోజు రారు. గిరిజనేతురుల నుండి రక్షణ కోసం 1/70 భూ బదలాయింపు చట్టం, ప్రాజెక్టుల అనుమతి కోసం గ్రామ సభలకు విశేష పాలనాధికారాల చట్టం (PESA), సాగునేల పై హక్కును ఇచ్చే అటవీ నియంత్రణ చట్టాలు ఏర్పాటు చేశాయి. అంతంత మాత్రమే అమలు అవుతున్న ఈ చట్టాల స్పూర్తిని బలహీనం చేసే అనేక సవరణలను మోడీ ప్రభుత్వం చేసింది. ఇటీవల సుప్రీం కోర్ట్ అటవీ భూములపై ఆదివాసీలకు హక్కులు ఇవ్వరాదని, వారిని అడవి నుండి ఖాళీ చేయించాలని తీర్పు ఇచ్జింది. ఈ కరోనా కాలంలో పది లక్షల ఆదివాసులను నిర్వాసితులుగా చేసే అనేక పవర్, గనుల తవ్వకం ప్రాజెక్టులకు ఎలాంటి తనిఖీలు లేకుండానే అనుమతిని ఇచ్చాయి.

“భారతీయులలో ఏదైనా ఒక వర్గం అతి అధ్వాన్నంగా చూడ పడ్డారంటే అది మా వాళ్లే ఆరు వేల ఏళ్లుగా మా వాళ్ళు పూర్తిగా విస్మరించ బడ్డారు అవమానించ బడ్డారు మేము సింధు నాగరికత బిడ్డలం ఈ దేశానికి వచ్చిన కొత్తవారు ఆర్యుల వల్ల నాగరిక ప్రపంచం నుండి అడవుల్లోకి తరిమివేయబడ్డవాళ్ళం. మీరంతా బయటనుండి వచ్చినవారే మేము ముందు నుండి ఈ దేశంలో ఉన్న వారం”అస్నాల శ్రీనివాస్

ఎన్నికల ప్రజాస్వామ్యం లో దళితుల, మైనారిటీలు నిర్ణయాక శక్తి గా ఉన్నారు. కొన్ని సార్లు రాజ్యాంగ అత్యున్నత పదవులను నిర్వహించారు. కాబట్టి వారి పట్ల ఎదో ఓ మేరకు సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. ఎన్నికలకు సంబంధించి ఆదివాసుల అతి తక్కువ చోట్ల ప్రభావాన్ని కలిగి ఉన్నారు, కీలక మంత్రి , ఇతర రాజ్యాంగ పదవులలో వీరు ఇంత వరకు చేపట్టలేదు. అవకాశం ఇవ్వలేదు. ప్రధాన ప్రసార మాధ్యమాలు వీరి బాధలను అంతగా ఫోకస్ చేయవు. పాలనా పరమైన వివక్షత,స్వదేశీ విదేశీ పెట్టుబడిదారులకు అటవీ సంపదను కట్ట బెట్టడం, అధికారుల అవినీతి, దళారుల దోపిడీ, మైదాన ప్రాంతవాసుల ఆధిపత్యంతో అడవిబిడ్డలు నేటికీ దుర్భర దారిద్య్రంలో మగ్గుతున్నారు. సరైన విద్య, వైద్యం, మౌలిక వసతులు కానరాక అవిద్య, ఆకలి, రోగాలతో అల్లాడుతున్నారు.

వలసపాలనలో 1885 సంతాల్ ,1890 బిర్సా ముండా ,1920 రంపా,1945 వర్లీ, తెలంగాణలో రాంజీ, కొమురం భీంల గిరిజన తిరుగుబాట్లు చెలరేగాయి. – అస్నాల శ్రీనివాస్

బ్రిటిష్ కాలం నుండి ఆరంభమయున ఆదివాసులపై దోపిడీ స్వతంత్ర భారతంలో హైపర్ సోనిక్ వేగంతో కొనసాగుతున్నది. వలసపాలనలో 1885 సంతాల్ ,1890 బిర్సా ముండా ,1920 రంపా,1945 వర్లీ, తెలంగాణలో రాంజీ, కొమురం భీంల గిరిజన తిరుగుబాట్లు చెలరేగాయి. ఇప్పటికే మధ్య భారతంలో మావోయిస్టులు, ఈశాన్య భారతంలో నాగా, కుకీ, బోడో తిరుగుబాటు దారులు సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. కేరళలో సైలెంట్ వ్యాలీలో, ఒడిశా నియమగిరి లో ఆదివాసులు తమ నిరసనలతోతమ జీవనానికి, ప్రకృతికి హాని కలిగించే ప్రాజెక్టులను ఆపివేయించారు. తిరుగుబాటు దారుల, ప్రభుత్వ బలగాల మధ్య రణంతో అడవి అంటుకుంటున్నది. ఇది ఇలా ఉంటే సంఘ పరివార్ శక్తులు, మిషనరీలు మతాతీతంగా తమదైన ప్రత్యేక సంస్కృతిలో కొనసాగుతున్న వీరిపై బలవంతంగా మతాన్ని రుద్దుతున్నారు. ఇది ఆదివాసుల జీవనాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టివేస్తున్నది. అసమానతల అశాంతి,తమ జవ జీవాలైన భాషా సంస్కృతులపై దాడులు కొనసాగితే చెలరేగే విప్లవ దావానం వ్యాపించకుండా ఉండాలంటే ఆదివాసులు హుందాగా గౌరవంగా బతకడానికి తగిన విధానాలు రూపొందించాలి. PESA, FRA,1/70 పరిపూర్ణంగా అమలు చేయాలి.విస్తాపనకు లోనైన వారికి గౌరవప్రద జీవనాన్ని ఇచ్చే పునరావాసాన్ని ఏర్పాటు చేయాలి.మిగులు భూములను పంచాలి. ఆటవి ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పాలి మనిషికి ప్రకృతి కి మధ్య సమతుల్యతను కొనసాగించే వాటి జీవన విధానముతోనే తల్లి భూదేవి మనుగడ ఆధారపడివుంది.నీటిని గాలిని అడవులను జనింపచేస్తున్న ఆదివాసీల వికాసానికి అండగా ఉందాము, వారిని మింగేస్తున్న ప్రపంచీకరణ పెట్టుబడిని నిరోధిద్దాం.

వ్యాసకర్త :
అస్నాల శ్రీనివాస్
9652275560
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం.