Home > ESSAYS > International Day of Play – అంతర్జాతీయ ఆటల దినోత్సవం

International Day of Play – అంతర్జాతీయ ఆటల దినోత్సవం

BIKKI NEWS (JUNE 11) : International Day of Play June 11th. అంతర్జాతీయ ఆటల దినోత్సవంను ప్రతి సంవత్సరం జూన్ 11న నిర్వహిస్తారు. ఆటల ప్రాముఖ్యాన్ని ప్రపంచానికి తెలియజేసే లక్ష్యంతో ఈ దినోత్సవం జరుపుతున్నారు.

International Day of Play June 11th.

మానవాభివృద్ధిలో ఆటలు ముఖ్య భూమిక పోషిస్తాయి. వీటిని కేవలం వినోదానికి సంబంధించిన విషయంగానే చెప్పలేం. పిల్లల్లో శారీరక, మానసిక ఎదుగుదలకు ఇవి ఎంతగానో తోడ్పడతాయి. కొత్త విషయాలను నేర్చుకోవడం అలవడుతుంది. దీంతోపాటు పిల్లలు ఇతరులతో కలిసి ఆడటం వల్ల సంబంధాలను మెరుగుపరచుకోవడం, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడం, సవాళ్లను అధిగమించడం లాంటివి నేర్చుకుంటారు.

International Day of Play 2025 theme : Choose play every day

వారి ఊహా వ్యక్తపరచడానికి, అభివృద్ధి చేయడానికి ఆటలు వేదికగా ఉంటాయి. తల్లిదండ్రులు శారీరక శ్రమ, ఆలోచనా శక్తిని పెంపొందించే ఆటలు ఆడేలా తమ పిల్లలను ప్రోత్సహించేలా చేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

మారుతున్న జీవనశైలి, చిన్న కుటుంబాలు, చదువుకు ప్రాధాన్యత పెరగడం, ఆటస్థలాల కొరత, చిన్నతనం నుంచే ఇంటర్నెట్ మొబైల్ ఫోన్ల వినియోగం లాంటి కారణాల వల్ల పిల్లలు ఆటలకు దూరమవుతున్నారు. ఐక్యరాజ్య సమితి (ఐరాస) గణాంకాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 14 సంవత్సరాలలోపు పిల్లల్లో 16 కోట్ల మంది ఎలాంటి ఆటలు ఆడటం లేదు వీరిలో 41% పిల్లలను వారి తల్లిదండ్రులే బయట ఆడుకోవడానికి అనుమతి ఇవ్వడం లేదు.

1989లో ఐరాస జనరల్ అసెంబ్లీ ఆటలు ఆడటాన్ని పిల్లల ప్రాథమిక హక్కుగా పేర్కొంది. అయితే ప్రస్తుతం ఆటలు ఆడేవారి సంఖ్య బాగా పడిపోయింది. 2023లో డెన్మార్కు చెందిన ఎస్ఈజీఓ ఫౌండేషన్, యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ (యునిసెఫ్), వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2024, మార్చి 25న సమావేశమైన ఐరాస జనరల్ అసెంబ్లీ పిల్లల జీవితాల్లో ఆటల ప్రాముఖ్యాన్ని చాటేలా ఏటా జూన్ 11న అంతర్జాతీయ ఆటల దినోత్సవాన్ని జరపాలని తీర్మానించింది. దీనికి 140 దేశాల ఆమోదం కూడా లభించింది. 2024 నుంచి ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు.

(డబ్ల్యూఈఎఫ్) సంయుక్తంగా 36 దేశాల్లోని 25 వేలకు పైగా చిన్నారులపై సర్వే నిర్వహించాయి. దీని ప్రకారం, 73% పిల్లలు ఆటలకు దూరంగా ఉన్నారు. కేవలం 30% తల్లితండ్రులు మాత్రమే తమ పిల్లలు ఆడుకునేలా ప్రోత్సహిస్తున్నారని తేలింది. ఎల్జీఓ, యునిసెఫ్ తమ నివేదికను ఐరాసకు అందించి ఆటల ప్రాముఖ్యం పెరిగేలా తగు చర్యలు తీసుకోవాలని సూచించాయి.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు