BIKKI NEWS (DEC – 07) : అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం (International Civil Aviation Day) అనేది ప్రతీయేటా డిసెంబరు 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా అన్నీ దేశాల్లో జరుపుకునే ఉత్సవం. ఇది 1996లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ప్రకటించింది ప్రపంచ సామాజిక మరియు ఆర్థిక అభివృద్ధికి విమానయానం, ముఖ్యంగా అంతర్జాతీయ విమాన ప్రయాణం యొక్క ప్రాముఖ్యతను గుర్తించడం ఈ రోజు లక్ష్యం.
★ చరిత్ర
1994లో తొలిసారిగా అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం జరపారు. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ICAO) 50వ వార్షికోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఇది ప్రారంభమైంది. 1996లో ఐక్యరాజ్యసమితి సాధారణ సదస్సు (UNGA) అధికారికంగా డిసెంబరు 7ను అంతర్జాతీయ పౌర విమానయాన దినాన్ని గుర్తించింది. ప్రపంచ దేశాల అభివృద్ధి, సామాజిక మార్పులు, ఆర్థిక వృద్ధి వంటి అంశాలలో విమానరంగం వల్ల కలుగుతున్న ప్రయోజనాలు, పొందుతున్న సేవలను ఈ రోజున ప్రజలకు అవగాహన కలిపించడం దీని ముఖ్య ఉద్దేశం.
★ కార్యకలాపాలు
ప్రతి ఐదేళ్లకు ఓసారి ICAO ప్రత్యేక థీమ్‌ని ప్రకటిస్తుంది. ఈ అంశాన్ని వార్షిక మండలి ప్రతినిధులు నిర్ణయిస్తారు. 2020కి “అడ్వాన్సింగ్ ఇన్నోవేషన్ ఫర్ గ్లోబల్ ఏవియేషన్ డెవలప్‌మెంట్” అనే థీమ్ ఎంచుకున్నారు. ఈ థీమ్ 2023 వరకూ అమల్లో ఉంటుంది.
2050కల్లా ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతుల మంది నగరాల్లోనే నివసిస్తారు. కాబట్టి విమాన ప్రయాణాలు మరింత విస్తరిస్తాయని ఐక్యరాజ్య సమితి అంచనా. 2030 సుస్థిరాభివృద్ధి అజెండాకు విమానయానం సమర్థంగా తోడ్పడుతుందని ఐరాస ఆశిస్తోంది.