Home > ESSAYS > INTERNATIONAL ALBINISM AWARENESS DAY – ఆల్బినిజం (బొల్లి) అవగాహన దినోత్సవం

INTERNATIONAL ALBINISM AWARENESS DAY – ఆల్బినిజం (బొల్లి) అవగాహన దినోత్సవం

BIKKI NEWS (JUNE 13) : INTERNATIONAL ALBINISM AWARENESS DAY అంతర్జాతీయ ఆల్బినిజం (బొల్లి) అవగాహన దినోత్సవంను ఏటా జూన్ 13న జరుపుకుంటారు.

INTERNATIONAL ALBINISM AWARENESS DAY

ఆల్బినిజం అనేది పుట్టుకతో వచ్చే అరుదైన, జన్యుపరంగా సంభవించే ఆనారోగ్య సమస్య. దీని వల్ల జుట్టు, చర్మం, కళ్లలో మెలనిన్ అనే వర్ణద్రవ్యం లోపించి, మొత్తం శరీరం తెల్లగా లేదా లేత గులాబీ రంగులోకి మారుతుంది. ఈ వ్యాధికి చికిత్స లేదు. అలాగే ఇది అంటువ్యాధి కాదు. దీని బారినపడినవారు శారీరక సమస్యలు ఎదుర్కొంటున్నారు. సామాజికంగానూ వివక్షకు గురవుతున్నారు. ఈ పరిస్థితులపై అవగాహన కల్పించడంతోపాటు వారి హక్కులను తెలియజేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

INTERNATIONAL ALBINISM AWARENESS DAY 2025 THEME : Demanding our rights: Protect our skin, Preserve our lives

ఐరాస ప్రకారం, ప్రపంచంలో 17 వేల మందిలో ఒకరు ఆల్బినిజంతో జన్మిస్తున్నారు. ఈ వ్యాధిబారిన పడ్డవారు భారతదేశంలో దాదాపు లక్షమంది ఉన్నారు. ఆల్బినిజం జననాలు టాంజానియాలో ఎక్కువగా ఉన్నాయి. అక్కడ ప్రతి 1500 జననాల్లో ఒకరు ఈ వ్యాధిబారిన పడుతున్నారు.

“ఆల్బినిజంకు గురైన వారు ప్రకాశవంతమైన కాంతి, సూర్యరశ్మిలో ఉండలేరు. చాలామందికి శాశ్వతంగా దృష్టిలోపం కలుగుతుంది.

చారిత్రక నేపథ్యం:

2000 కాలంలో టాంజానియాలో ఆల్బినిజం ఒక ప్రధాన సమస్యగా ఉండేది. వారిని దుష్టశక్తులుగా భావించి, హత్య చేసేవారు. ఈ విధంగా అక్కడ వందలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో టాంజానియా ఆల్బినిజం సొసైటీ (టీఏఎస్) ఆ వ్యాధిగ్రస్తుల హక్కుల కోసం ప్రచారం చేసింది.

2006, మే 4న టీఏఎస్ మొదటి ఆల్బినో దినోత్సవాన్ని నిర్వహించింది. 2009 నుంచి దీన్ని జాతీయ ఆల్బినో దినోత్సవంగా పిలుస్తున్నారు.

ఐరాస మానవ హక్కుల మండలి (యూఎన్ఎస్ఆర్సీ) 2013, జూన్ 13న ఆల్బినిజం ఉన్న వ్యక్తులపై దాడులు, వివక్షకు వ్యతిరేకంగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది. 2014, డిసెంబరు 18న జరిగిన యూఎన్ జనరల్ అసెంబ్లీ జూన్ 13ను ‘అంతర్జాతీయ ఆల్బినిజం అవగాహన దినోత్సవం’గా ప్రకటించింది. 2015 నుంచి ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు