BIKKI NEWS (OCT. 08) : intermediate students not allowed to exams without attendance. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యార్థులకు 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలని బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా ఉత్తర్వులు జారీ చేశారు.
intermediate students not allowed to exams without attendance
మొదటి, రెండో ఏడాది చదివే రెగ్యులర్ విద్యార్థులకు 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. 75% కంటే తక్కువ ఉంటే అపరాధ రుసుము చెల్లించాలని పేర్కొన్నారు.
’60-65% ఉంటే 2,000/- రూపాయలు, 65-70% ఉంటే 1,500/- రూపాయలు 70-75% ఉంటే 1,000/- రూపాయల అపరాధ రుసుము చెల్లించాలని పేర్కొన్నారు.
60 శాతం కంటే తక్కువ హాజరు ఉంటే.. సైన్సు విద్యా ర్థులు పబ్లిక్ పరీక్షలు రాయడానికి అనర్హులు. ఆర్ట్స్ విద్యార్థుల్ని ప్రైవేట్ క్యాండిడేచర్ కింద పరిగణనలోకి తీసుకుని పరీక్షలకు అనుమతిస్తారు’ అని తెలిపారు. ఒకేషన్ విద్యార్థులకూ ఇది వర్తిస్తుందన్నారు.