Home > EDUCATION > INTERMEDIATE > INTERMEDIATE – విలీనం పై ప్రభుత్వం సంకేతాలు

INTERMEDIATE – విలీనం పై ప్రభుత్వం సంకేతాలు

BIKKI NEWS (JULY 04) : INTERMEDIATE MERGE IN SCHOOL EDUCATION IN TG. తెలంగాణ రాష్ట్రంతో పాటు మరో ఏడు రాష్ట్రాలలో పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ విద్యలకు వేరువేరు బోర్డులు ఉండటం పట్ల కేంద్ర విద్యా శాఖ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు కేంద్ర విద్యా శాఖ ఎనిమిది రాష్ట్రాలకు ఇంటర్మీడియట్ విద్యను స్కూల్ విద్యలో విలీనం చేయాలని అధికారికంగా లేఖలు పంపినట్లు సమాచారం.

INTERMEDIATE MERGE IN SCHOOL EDUCATION IN TG

21 రాష్ట్రాల్లో సీబీఎస్ఈ విధానం ప్రకారం 10+2 అమలవుతుండగా 8 రాష్ట్రాల్లోనే ఇంటర్మీడియట్ విద్య అమలవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ 8 రాష్ట్రాల్లో కూడా 10 + 2 విద్యా విధానాన్ని అమలు చేయాలని కేంద్రం గట్టిగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలోనే తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ పై జరిపిన సమీక్షలో ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యలో విలీనంపై తీవ్రంగా చర్చించినట్లు సమాచారం. రెండు బోర్డులు ఉండటం వల్ల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని, అలాగే పదవ తరగతి చదివిన తర్వాత భారీ సంఖ్యలో విద్యార్థులు డ్రాప్ అవుట్ లుగా మిగిలిపోతున్నారని కూడా నివేదికలు చెబుతున్నాయని ముఖ్యమంత్రి విద్యాశాఖ అధికారులతో పేర్కొన్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలోనే ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేసి అంశంపై సమగ్రంగా నివేదికను రూపొందించాలని అధికారులకు సీఎం ఆదేశించారు .

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు