BIKKI NEWS (NOV. 11) : INTERMEDIATE BOARD NEW DIRECTOR KRISHNA ADITYA. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డ్ నూతన డైరెక్టర్ గా ఐఏఎస్ యస్. కృష్ణ ఆదిత్య ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
INTERMEDIATE BOARD NEW DIRECTOR KRISHNA ADITYA
ఇప్పటి వరకు ఇంచార్జి గా ఉన్న శ్రీదేవసేన ను విధుల నుండి రీలీవ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈరోజు మొత్తం 13 మంది ఐఏఎస్ లకు స్థానచలనం గావిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.
పర్యాటకం, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ కార్యదర్శిగా స్మితా సబర్వాల్ నియామకం అయ్యారు. రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ కార్యదర్శిగా స్మితా సబర్వాల్ అదనపు బాధ్యతల్లో కొనసాగనున్నారు.
బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఇ. శ్రీధర్, దేవాదాయ శాఖ కమిషనర్‌గా శ్రీధర్‌కే అదనపు బాధ్యతలు అప్పగించారు.
మహిళ, శిశు సంక్షేమం, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా అనితా రామచంద్రన్,
జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఇలంబరితి,
రవాణా శాఖ కమిషనర్‌గా కే సురేంద్ర మోహన్,
ఎక్సైజ్ శాఖ డైరెక్టర్‌గా సీహెచ్ హరికిరణ్,
ట్రాన్స్ కో సీఎండీగా కృష్ణ భాస్కర్, డిప్యూటీ సీఎం ప్రత్యేక కార్యదర్శిగా అదనపు బాధ్యతల్లో కూడా కృష్ణ భాస్కర్ కొనసాగనున్నారు.
ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోగా శివశంకర్,
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి డైరెక్టర్‌గా సృజన నియామకం అయ్యారు.