BIKKI NEWS (APR. 22) : INTERMEDIATE ADMISSIONS IN MJP BC GURUKULAS 2025. తెలంగాణ రాష్ట్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే బిసి గురుకులాల్లో 2025 – 26 విద్యా సంవత్సరం కొరకు ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ అయింది.
INTERMEDIATE ADMISSIONS IN MJP BC GURUKULAS 2025
ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం పదో తరగతి మార్కుల మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు చేయనున్నారు
విద్యార్థులు ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 22వ తేదీ నుండి మే 12వ తేదీ వరకు దరఖాస్తు కడవు కలదు.
ఎంపీసీ, బైపిసీ, సిఇసి, హెచ్ఈసి, ఎంఈసిలతో పాటు అగ్రికల్చర్ క్రాప్ ప్రొడక్షన్, కంప్యూటర్ గ్రాఫిక్స్, యానిమేషన్, ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్, కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపీ కోర్సులు బీసీ గురుకులాల్లో అందుబాటులో ఉన్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా 130 బీసీ గురుకుల జూనియర్ కళాశాలలో కలవు. వీటిలో బాలురకు 11,360 సీట్లు, బాలికలకు 10,720 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
బిసి గురుకుల పాఠశాలల్లో పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ప్రత్యేకంగా ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని, వారు 10వ తరగతి చదివిన గురుకుల స్కూల్లోని సంబంధిత ప్రిన్సిపాల్ కు దరఖాస్తు ఇస్తే సీట్లు కేటాయిస్తారని ఈ సందర్భంగా బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి సైదులు తెలిపారు.
వెబ్సైట్ : https://mjpabcwreis.cgg.gov.in/TSMJBCWEB/
- AP CONSTABLE JOBS – జూన్ 1న 6100 కానిస్టేబుల్ తుది పరీక్ష
- TG 10th Result – నాలుగు రోజుల్లో పదో తరగతి ఫలితాలు
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 25 – 04 – 2025
- MALARIA DAY – ప్రపంచ మలేరియా దినోత్సవం
- చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 25