Home > EDUCATION > INTERMEDIATE > INTER – ప్రభుత్వ కళాశాలలకు ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెళ్లు, టీవీలు – సీఎం గ్రీన్ సిగ్నల్

INTER – ప్రభుత్వ కళాశాలలకు ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెళ్లు, టీవీలు – సీఎం గ్రీన్ సిగ్నల్

BIKKI NEWS (JULY 03) : interactive flat panels and tvs for junior colleges. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనున్నారు. అలాగే డిజిటల్ తరగతుల కోసం ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెళ్లు, జేఈఈ, నీట్, ఎఫ్‌సెట్ లాంటి ఆన్లైన్ కోచింగ్ కోసం పెద్ద టీవీలు మంజూరుకు సీఎం అంగీకరించారని ఇంటర్ బోర్డు వర్గాలు తెలిపాయి.

interactive flat panels and tvs for junior colleges.

బుధవారం విద్యాశాఖ పై జరిగిన సమీక్ష సమావేశంలో ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి శ్రీ కృష్ణ ఆదిత్య చేసిన పలు ప్రతిపాదనలకు సీఎం ఆమోదం తెలిపినట్లు ఇంటర్ వర్గాలు తెలిపాయి.

ఇప్పటికే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రతి తరగతిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. పలు జిల్లాలలో ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.

విద్యార్థులకు నాణ్యమైన డిజిటల్ బోధన అందించడమే లక్ష్యంగా ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి శ్రీ కృష్ణ ఆదిత్య పలు సంస్కరణలకు శ్రీకారం చుడుతున్న సంగతి తెలిసిందే.