Home > EDUCATION > INTERMEDIATE > INTER EXAMS 2025 – ఈసారి కీలక మార్పులు, నిబంధనలు ఇవే

INTER EXAMS 2025 – ఈసారి కీలక మార్పులు, నిబంధనలు ఇవే

BIKKI NEWS (DEC. 25) : INTER EXAMS 2025 RULES and Regulations. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ఈసారి నిర్వహించే పబ్లిక్ ఎగ్జామ్స్ మరియు ప్రాక్టీకల్ ఎగ్జామ్స్ లలో కీలక మార్పులను తీసుకురానుంది. ఈ మేరకు సంస్కరణలకు ప్రస్తుత డైరెక్టర్ కృష్ణ ఆదిత్య ఆమోదం తెలుపుతున్నట్లు సమాచారం.

INTER EXAMS 2025 RULES and Regulations.

ఫిబ్రవరి 3 నుండి జరగనున్న ప్రాక్టికల్ పరీక్షలను సీసీ కెమెరాల ఆధ్వర్యంలో నిర్వహించాలని సూత్ర ప్రాయాంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గతంలో కేవలం ప్రాక్టీకల్ ఆన్లైన్ మార్కులను మాత్రమే సీసీ కెమెరాలు పర్యవేక్షణలో వేసేవారు. ఈసారి ప్రాక్టికల్ పరీక్షలకు నిర్వహించే ల్యాబ్ లలో సైతం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కృష్ణ ఆదిత్య భావిస్తున్నట్లు సమాచారం.

ఈసారి ప్రాక్టికల్ పరీక్షల ప్రశ్నా పత్రాలపై క్యూఆర్ కోడ్ తో పాటు సీరియల్ నెంబర్ ను కూడా ముద్రించనున్నారు. దీంతో పేపర్ లీక్ అయితే ఏ సెంటర్ నుండి పేపర్ లీక్ అయ్యింది అనే విషయం వెంటనే తెలియనుంది.

పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లను ఆన్లైన్లో ఇంతకుముందు పరీక్షలకు పది రోజుల ముందు విద్యార్థులకు అందుబాటులో ఉంచేవారు. ఈసారి నాలుగు వారాల ముందే హల్ టికెట్లు అందుబాటులో ఉంచుతారు.

హాల్ టికెట్లు ఆన్లైన్ లో పెట్టగానే విద్యార్థుల మొబైల్ నంబర్ కు మెసేజ్ వెళ్ళనుంది.

విద్యార్థులకు ఎలాంటి సమస్యలు వచ్చినా కాల్ చేయడానికి హాల్ టికెట్లపై పరీక్షల కంట్రోలర్ నెంబర్ తో పాటు జిల్లాల డిఐఈఓల నెంబర్లను కూడా ముద్రించనున్నారు.

ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ప్రశ్నాపత్రాలను ఈసారి లోడెన్సిటీ పాలిథిన్ కవర్లలో పంపనన్నారు. ఈ కవర్లు ఒకసారి చదివితే మళ్ళీ అతుక్కోవు. కావునా ఈ కవర్లు ఎక్కడైనా మధ్యలో చినిగినట్లు అనిపిస్తే పేపర్ లీకైనట్లు గుర్తిస్తారు.

ఈసారి ప్రశ్నాపత్రాలను ఉమ్మడి జిల్లాల కేంద్రాలకు కాకుండా అన్ని జిల్లా కేంద్రాలకు ఒకేసారి పంపనున్నారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు