BIKKI NEWS (JAN. 30) : INTER EXAMS 2025 CC CAMERAS ISSUE. తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ జూనియర్ కళాశాలలపై ఇంటర్ బోర్డు వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ కళాశాలల యాజమాన్య సంఘాలు ఇంటర్ పరీక్షలు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించాయి.
INTER EXAMS 2025 CC CAMERAS ISSUE
ప్రాక్టికల్ పరీక్షలు జరిగే ల్యాబ్ లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయబోమని, థియరీ, ప్రాక్టికల్ పరీక్షలకు సహకరించబోమని స్పష్టం చేశాయి.
తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజీ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ (టీపీజేఎంఏ) విస్తృతస్థాయి సమావేశాన్ని బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో టీపీజేఎంఏ అధ్యక్షుడు గౌరి సతీశ్ మాట్లాడుతూ… ఫైర్ ఎన్‌వోసీ నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చినా, జరిమానాల పేరుతో యాజమాన్యాలను బోర్డు ఇబ్బందులకు గురిచేయడం దురదృష్టకరమని వాపోయారు. పెండింగ్‌లోని స్కాలర్‌షిప్పులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గురువారం నుంచి డీఐఈవోలను కలిసి వినతిపత్రాలు సమర్పిస్తామని గౌరి సతీశ్ ప్రకటించారు.
ఈ అంశంపై సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ ఈ విషయంపై సీఎం తో మాట్లాడుతానని తెలిపారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్