BIKKI NEWS (OCT. 26) : Inter exam fees march 2025 without college study. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు 2025 మార్చిలో నిర్వహించే పబ్లిక్ పరీక్షలకు సంబంధించి హజరు మినహాయింపు ప్రైవేట్ అభ్యర్థులు (వితౌట్ కాలేజీ స్టడీ) కొరకు పరీక్ష చెల్లింపు షెడ్యూల్ను విడుదల చేసింది. అలాగే ఈ అభ్యర్థులు గ్రూప్ మార్పు కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
Inter exam fees march 2025 without college study
కళాశాలకు హాజరుకాకుండా హజరు మినహాయింపు కేటగిరీలో ప్రైవేట్ గా పరీక్షలు రాసే ఈ అభ్యర్థులు పరీక్ష ఫీజు చెల్లించడానికి తుది గడువు 20 నవంబర్ 2024 గా నిర్ణయించారు. 200/- రూపాయల ఆలస్య రుసుముతో ఈ అభ్యర్థులు పరీక్ష ఫీజును డిసెంబర్ 18వ తేదీ వరకు చెల్లించవచ్చు.
హాజరమైన మినహాయింపు పొంది ప్రైవేట్ గా పరీక్షలు రాసే అభ్యర్థులు కూడా ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కావలసి ఉంటుందని బోర్డు స్పష్టం చేసింది.
ఈ విద్యార్థులకు 500/- రూపాయలు ఫీజును ఖరారు చేశారు. ఈ ఫీజు రీఫండ్ చేయబడదు.
అర్హతలు : పదవ తరగతి పాసై ఒక సంవత్సరం గ్యాప్ ఉన్న అభ్యర్థులు మొదటి సంవత్సరం పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. ఒకవేళ రెండు సంవత్సరాల గ్యాప్ ఉంటే ప్రధమ మరియు ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫీజులను ఒకేసారి చెల్లించి పరీక్షలు రాయవచ్చు.
ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ గ్రూపులలో మాత్రమే ప్రైవేట్ అభ్యర్థులు హాజరు కావడానికి అర్హులు.
ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరంలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అదనపు సబ్జెక్టులు రాయడానికి ఫీజు చెల్లించవచ్చు. బైపీసీ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మ్యాథమెటిక్స్ సబ్జెక్టును అదనపు సబ్జెక్టుగా రాయవచ్చు.