BIKKI NEWS (MARCH 29) : తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ 2024 – 25 విద్యా సంవత్సరానికి గాను అకడమిక్ యాన్యువల్ క్యాలెండర్ ను (INTER ACADEMIC CALENDAR 2024 – 2025) విడుదల చేసింది.
ఈ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం విద్యా సంవత్సరం జూన్ 1- 2024న ప్రారంభమై, మార్చి 29 – 2025న ముగియనుంది.
ఈ విద్యా సంవత్సరంలో మొత్తం పని దినాలు 227 గా ఉండనున్నాయని ప్రకటించారు
దసరా సెలవులు అక్టోబర్ 6 నుండి 13 వరకు ఉండనున్నాయి. సంక్రాంతి సెలవులు జనవరి 11 నుండి 16 వరకు ఉండనున్నాయి
అర్ధవార్షిక పరీక్షలు నవంబర్ 18 నుండి 23 వరకు, ప్రీ ఫైనల్ పరీక్షలు జనవరి 20 నుండి 25 వరకు ఉండనున్నాయి.
ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి మొదటి వారంలో, పబ్లిక్ పరీక్షలు మార్చి మొదటి వారంలో ప్రారంభం కానున్నాయి.