BIKKI NEWS (MARCH 22) : ‘THE RISE OF BILLIONEER RAJ – 1922 – 2023’ పేరుతో భారత్ లో ఆర్దిక అసమానతలపై ‘వరల్డ్ ఇనిక్వాలిటీ ల్యాబ్’ ఒక నివేదిక తయారు (inequality index 2023 of india) చేసింది. ఈ నివేదిక ప్రకారం టాప్ 1% సంపన్నుల చేతిలో 40.1% దేశ ఆదాయం కేంద్రీకృతమై ఉందని పేర్కొంది.
2014 – 15 నుండి 2022 – 23 మధ్య సంపద కేంద్రీకృతం అవ్వడం విపరీతంగా పెరిగిందని, ఇది ఆర్థిక అసమానతలకు దారి తీసిందని నివేదిక స్పష్టం చేసింది.
2022 – 23 ఆర్థిక సంవత్సరంలో 167 సంపన్న కుటుంబాల నికర సంపదపై 2 శాతం సూపర్ టాక్స్ విధించినప్పటికీ 0.5% జాతీయ ఆదాయంతో సమానమని నివేదిక పేర్కొంది.
బ్రిటిష్ కాలంతో పోలిస్తే స్వతంత్ర భారతదేశంలోని ఆర్థిక అసమానతలు పెరిగిపోయినట్లు నివేదిక స్పష్టం చేస్తుంది.
స్వాతంత్రం తర్వాత 1980 వరకు ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు తగ్గుతూ వచ్చాయని నివేదిక పేర్కొంది తదనంతరం ఆర్థిక అసమానతలు పెరుగుదల క్రమంగా పెరుగుతూ వచ్చిందని పేర్కొంది
1922లో టాప్ వన్ సంపన్నుల దగ్గర ఉన్న సంపద 13 % అని నివేదిక పేర్కొంది
1982 నాటికి టాప్ వన్ సంపన్నుల దగ్గర ఉన్న సంపద 6.1% దిగొచ్చిందని నివేదిక పేర్కొంది
1991 ఆర్థిక సంస్కరణ తర్వాత సంపద కేంద్రం పెరుగుతూ 2022 నాటికి 22.6% చేరింది