INDvsAUS : కోహ్లీ, రాహుల్ కమాల్ – టీమిండియా గెలుపు

చెన్నై (అక్టోబర్ – 08) : ICC CRICKET WORLD CUP 2023 లో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియా జట్ల మద్య జరిగిన మ్యాచ్ లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 2 పరుగులకే 3 వికెట్లు పడిన విరాట్ కోహ్లీ అనుభవం, రాహుల్ నిలకడ తోడుగా టీమిండియా తన తొలి మ్యాచ్ లో ఘనవిజయం సాధించి పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది.

200 పరుగుల లక్ష్యం తో బ్యాటింగ్ ఆరంభించిన భారత్ కు ఇషాన్ కిషన్ డకౌట్, కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్, శ్రేయస్ అయ్యర్ డకౌట్ భారత అభిమానులు నిరాశను పటాపంచలు చేస్తూ విరాట్ కోహ్లి సున్నా నుండి ప్రారంభించే తెగులు, టన్నుల కొద్ది ఒత్తిడిని బ్యాట్ లోకి పంపి పరుగు, పరుగు రాహుల్ తో కలిసి 167 పరుగులు పోగేసి భారత్ ను విజయతీరాలకు చేర్చి 85 పరుగుల చేసి ఔటయ్యాడు. మిగతా పనిని రాహుల్ (97*) పూర్తి చేశాడు.

అంతకుముందు ఆస్ట్రేలియాను 199 పరుగులకు భారత బౌలర్లు ఆలౌట్ చేశారు. జడేజా – 3, బుమ్రా, కులదీప్ యాదవ్ తలో రెండు వికెట్లు తీశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టులో డేవిడ్ వార్నర్ – 41, స్మిత్ – 46 పరుగులతో రాణించారు.