BIKKI NEWS : INDUS WATER TREATY FULL INFORMATION IN TELUGU. సింధూ నది ఒప్పందం భారత్, పాకిస్థాన్ దేశాల మద్య ప్రపంచ బ్యాంకు మద్యవర్తిత్వంతో 1960 సెప్టెంబర్ 19న కుదిరింది.
INDUS WATER TREATY FULL INFORMATION IN TELUGU
అప్పటి భారత దేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మరియు పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయుభ్ ఖాన్ లు ఈ ఒప్పందం మీద సంతకాలు చేశారు.
ఈ ఒప్పందం సింధూ నది జలాలు రెండు దేశాల మద్య జరగాల్సిన పంపిణీ ని వివరిస్తుంది.
ఈ ఒప్పందం ప్రకారం సింధూ నది తూర్పు నుంచి పశ్చిమ దిశగా పయనిస్తున్న నేపథ్యంలో… పశ్చిమ దిశలోని ఉప నదులు అయినా సింధూ, జీలం, చీనాబ్ నదుల జలాలు పాకిస్థాన్ కు, తూర్పు దిశలోని నదులు అయినా రావి, బియాస్, సట్లెజ్ నదుల జలాలు భారత్ కు దక్కుతాయి.
ఈ నది వ్యవస్థలో ముఖ్యమైన ప్రాజెక్టులు తార్‌బెలా డ్యామ్ సింధూ నదిపై, మంగ్లా డ్యామ్ జీలం నది పై పాకిస్థాన్ లో ఉన్నాయి.
భారత్ లో ఎక్కువగా విద్యుత్ ఉత్పత్తి కోసం హైడ్రో పవర్ ప్రాజెక్టులు ఈ ఉపనదుల పై పాకిస్థాన్ సరిహద్దుకు దూరంగా కలవు.
ఈ నదులు భారతదేశము నుండి ప్రవహించడం వల్ల, భౌగోళికంగా భారతదేశానికి అనుకూలతలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో… యుద్ధ సమయంల, ఉద్ధృక్తతల సమయంలో నీటిని భారత్ నిలుపుదల చేస్తుందని భయాందోళన నేపద్యంలో రెండు దేశాల మధ్య ఈ ఒప్పందం కుదిరింది.

ఎన్ని ఉద్రికత పరిస్థితులు వచ్చిన, యుద్ధాలు వచ్చినా భారత్ ఈ ఒప్పందానికి ఇప్పటివరకు కట్టుబడి ఉండటం విశేషం. తాజాగా పహల్గామ్ లో జరిగిన దాడి నేపథ్యంలో భారతదేశం మొదటిసారి ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
దీంతో పాకిస్తాన్ కు తాగు నీటికి తీవ్ర ఆటంకం ఏర్పడుతుందని జల నిపుణులు పేర్కొంటున్నారు. దాదాపు 80% పంటలు సింధూ నది వ్యవస్థ మీదనే పాకిస్తాన్ లో ఆధారపడి ఉన్నాయని అంతర్జాతీయ జల నిపుణుల తెలుపుతున్నారు.
సింధు నది వ్యవస్థలో పాకిస్థాన్ కు కేటాయించిన నదులలో భారత్ 20% నీటిని ఉపయోగించుకునే వెసులుబాటు ఉంది. అయినప్పటికీ ఇంతవరకు ఈ వాటాను ఎప్పుడు భారత్ ఉపయోగించుకోలేదు.
అయితే వెంటనే నది జలాలను ఆపే ఆనకట్టలు, బ్యారెజ్ లు భారతదేశంలో నిర్మితమై లేవు. కేవలం హైడ్రో పవర్ ప్రాజెక్టులు మాత్రమే ఈ నదీ జలాల మీద భారత్ ఇప్పటివరకు ఎక్కువగా నిర్మించింది.
ఈ నేపథ్యంలోనే ఈ అంశంపై చర్చించిన కేంద్రం మూడు అంచెల విధానం ద్వారా నదీ జలాలను నిలుపుదల చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేసుకుంది.
- AP EAPCET CUTOFF MARKS – కళాశాలల వారీగా కటాఫ్ మార్కులు
- AP EAPCET 2025 COUNSELLING షెడ్యూల్
- AP DEECET COUNSELING 2025 షెడ్యూల్
- Jobs – విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంకులో జాబ్స్
- DAILY GK BITS IN TELUGU 4th JULY