Home > CURRENT AFFAIRS > AWARDS > INDIRA GANDHI PEACE PRIZE 2023 – ఇందిరాగాంధీ శాంతి బహుమతి 2023

INDIRA GANDHI PEACE PRIZE 2023 – ఇందిరాగాంధీ శాంతి బహుమతి 2023

BIKKI NEWS (NOV. 20) : INDIRA GANDHI PEACE PRIZE 2023. శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి కోసం కృషి చేసే వారికి ప్రతి ఏడాది ప్రదానం చేసే ఇందిరా గాంధీ శాంతి బహుమతికి 2023 కు గానూ అర్జెంటీనా, పాలస్తీనాకు చెందిన ఇద్దరు అహింసావాదులు ఎంపికయ్యారు.

INDIRA GANDHI PEACE PRIZE 2023

పాలస్తీనా- ఇజ్రాయెల్ ఘర్షణను శాంతియుతంగా, చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్న డేనియల్ భారెన్‌బోయిమ్, అలీ అబూ అవాద్ సంయుక్తంగా ఈ పురస్కారం అందుకోనున్నారు.

జన్మతహా అర్జెంటీనా జాతీయుడైన డేనియల్ బారెన్ బోయిమ్ సుప్రసిద్ధ పియానో సంగీత వాయిద్య కారుడు. పశ్చిమాసియాలో ఘర్షణల నివారణకు కృషి చేస్తున్నారు.

అలీ అబూ అవాద్ పాలస్తీనా శాంతి కార్యకర్త. 1972లో జన్మించిన అలీ అవాద్ గాంధేయవాదిగా గుర్తింపు పొందారు. రూట్స్ అనే కార్యక్రమం ద్వారా 2014 నుంచి పాలస్తీనియన్లు, ఇజ్రాయెలీలకు అహింస, పరస్పర అవగాహన, పరివర్తనలపై అవగాహన కల్పిస్తున్నారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు