BEST FOOD – జీ20 దేశాలలో ఉత్తమ ఆహరం భారత్ దే- నివేదిక

BIKKI NEWS (OCT. 12) : indias food is best in G20 Countries report by WWF. ప్రపంచ వన్యప్రాణి ఫౌండేషన్ జి20 దేశాలలో ఆహారంపై నివేదిక రూపొందించింది. ఈ నివేదికలో పర్యావరణహిత ఆహారంలో భారత ఆహారం మొదటి స్థానంలో నిలిచింది.

indias food is best in G20 Countries report by WWF.

తక్కువ భూమిలో ఎక్కువ ఆహార పంటలను పండించడం ద్వారా ఆహారం ఉత్పత్తిని పెంచడం ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.

2050 నాటికి పెరుగుతున్న జనాభా ఆహారపు అవసరాలకు అనుగుణంగా భారత ఆహారపు అలవాట్లు ఉన్నాయని… 2050 నాటికి ఒక్క భూమికంటే తక్కువ భూమిలోనే ప్రపంచానికి ఆహారం అందించే విధానం భారత ఆహారపు అలవాట్లలో ఉందని స్పష్టం చేసింది.

అయితే శాఖాహారము ద్వారానే భూమిని కాపాడుకోగలమని మాంసాహారము ద్వారా ఇది సాధ్యం కాదని స్పష్టం చేసింది.

భారతదేశంలో ప్రారంభించిన నేషనల్ మిల్లెట్ క్యాంపెయిన్ ఈ ఆహారపు అలవాట్లను మార్చడంలో ఎంతగానో దోహదపడిందని ప్రకటించింది.

ప్రపంచ మిల్లెట్ల ఉత్పత్తిలో భారత్ వాట 41 శాతంగా ఉందని నివేదిక స్పష్టం చేసింది.

ప్రపంచంలో ప్రస్తుతం 250 కోట్ల మంది ఉండాల్సిన బరువు కంటే అధికంగా ఉన్నారని, 89 కోట్ల మంది ఊబకాయులు ఉన్నారని ఈ నివేదిక తెలిపింది.

ఉత్తమ ఆహారం ఉత్పత్తిలో భారత్ ప్రథమ స్థానంలో ఉండగా అర్జెంటీనా 20వ స్థానంలో నిలిచింది.

2050 నాటికి 0.84 భూమిలోనే భారత ఆహారం ద్వారా ప్రపంచానికి ఆహారం అందజేయవచ్చు. అదే అర్జెంటీనా ఆహర ఉత్పత్తి విధానంలో అయితే 7.42 భూములు అవసరం అవుతాయి.

BEST FOOD COUNTRIES IN G20

1) ఇండియా
2) ఇండోనేషియా
3) చైనా
4) జపాన్
5) సౌదీఅరేబియా
6) టర్కీ
7) దక్షిణ కొరియా
8) దక్షిణాఫ్రికా
9) మెక్సికో
10) జర్మనీ
11) రష్యా
12) ఈయూ
13) యూకే
14) కెనెడా
15) ఇటలీ
16) ప్రాన్స్
17) బ్రెజిల్
18) అమెరికా
19) అల్జీరియా
20) అర్జెంటీనా

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు