BIKKI NEWS : భారతదేశం నుండి వివిధ దేశాలకు వలస వెళ్లిన భారతీయులు ఆదేశంతో మమేకమై అక్కడి అత్యున్నత పదవులైన అధ్యక్ష, ప్రధానమంత్రి పదవులను అధిరోహించడం ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది.
పోటీ పరీక్షల నేపథ్యంలో వివిధ దేశాలలో అత్యున్నత పదవులైన ప్రధానమంత్రి, అధ్యక్షుడు వంటి పదవులను అధిరోహించిన భారత మూలాలున్న భారత సంతతి వ్యక్తుల జాబితాను (list of indian who elected has presidents and prime ministers of different countries) చూద్దాం…
2021 తర్వాత ప్రపంచవ్యాప్తంగా 15 దేశాలకు భారత్ మూలాలు ఉన్న వ్యక్తులు అధిపతులుగా ఉన్నారని 200 మందికి పైగా నేతలు ముఖ్య పదవుల్లో ఉన్నారని ఒక నివేదిక చెబుతోంది.
అలాగే భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా భారత మూలాలు ఉన్న వ్యక్తుల సంఖ్య 3.2 కోట్లు
★ ముఖ్య నేతల జాబితా
- కమలా హరీశ్ – అమెరికా ఉపాధ్యక్షురాలు
- రిషీ సునాక్ – బ్రిటన్ ప్రధానమంత్రి
- థర్మన్ షణ్ముగరత్నం – సింగపూర్ అధ్యక్షుడు
- లోయో ఎరిక్ వరాద్కర్ – ఐర్లాండ్ ప్రధానమంత్రి
- అంటోనియో కోస్టా – పోర్చుగల్ ప్రధానమంత్రి
- ఎలెక్ట్ క్రిస్టిన్ కార్లా కంగాలూ – ట్రినిడాడ్ & టోబాగో ప్రధానమంత్రి
- ప్రవింద్ జగన్నాథ్ – మారిషస్ ప్రధానమంత్రి
- పృథ్వీరాజ్ సింగ్ రూపన్ – మారిషస్ అధ్యక్షుడు
- చంద్రిక ప్రసాద్ సంతోఖీ – సూరినామ్ అధ్యక్షుడు
- మొహమ్మద్ ఇర్ఫాన్ ఆలీ – గయానా అధ్యక్షుడు
- వావెల్ రామకల్వాన్ – సీషెల్స్ అధ్యక్షుడు